BiggBoss : ముద్దు పెడితే కడుపు వస్తుందని అనుకుందట.. బిగ్ బాస్ లో ఆ కంటెస్టంట్ కామెంట్స్ వైరల్..!

BiggBoss సీజన్ 6 లో ఓ కంటెస్టంట్ తన టీనేజ్ లో ముద్దు పెడితే కడుపు వస్తుందని అనుకుందట. ఇంతకీ అలా అనుకున్న హౌజ్ మెట్ ఎవరు అంటే ఆరోహి రావు అని తెలుస్తుంది. తన యాసతో అందరిని అలరిస్తున్న ఆరోహి తన డిగ్రీ టైం లవ్ స్టోరీ చెప్పింది. అది కూడా సుదీపా అలియాస్ పింకీతో తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంటుంది. ఆ టైం లో తనకి ముద్దు పెడితే కడుపు వస్తుందన్న భవన ఉండేదని అన్నది.

తన డిగ్రీ టైం లో ఒకతనితో క్రష్ ఉండేదని. అది క్రషా.. లేక లవ్వా అని తెలుసుకునేందుకు టైం పట్టిందని. నెల రోజుల్లోనే తాను ఆ ఫీలింగ్ నుంచి బయటకు వచ్చానని చెప్పుకొచ్చింది ఆరోహి. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఆమె కూడా ఉంది. తెలంగాణా యాసలో ఆమె మాట్లాడుతున్న తీరు అందరిని ఆకట్టుకుంటుంది. ఆరోహి కొన్నాళ్లు హౌజ్ లో ఉండేలా ఉంది. అయితే టాస్క్ ల విషయంలో ఇంకా ఆమె టర్న్ రాలేదు.

అది కూడా ప్రూవ్ చేసుకోగలిగితే ఆరోహి బిగ్ బాస్ 6 లో మంచి కంటెస్టంట్ గా ఉంటుందని చెప్పొచ్చు. ఈసారి 21 మంది కంటెస్టంట్స్ BiggBoss హౌజ్ లో ఉండగా కేవలం వారానికి ఒక్కరు మాత్రమే కాదు అప్పుడప్పుడు డబుల్ ఎలిమినేషన్స్ కూడా ఉంటాయని తెలుస్తుంది.

Tags: Arohi Rao, Arohi Rao Lovestory, BiggBoss, BiggBoss 6, BiggBoss Telugu, Star Maa