Pawan Kalyan :ఆగిపోయిన పవన్ కళ్యాణ్ సినిమా.. హమ్మయ్య అనుకుంటున్న పవర్ స్టార్ ఫ్యాన్స్..!

ఏదైనా స్టార్ హీరో సినిమా అట్టహాసంగా మొదలై మధ్యలో ఆగిపోతే ఏ హీరో ఫ్యాన్స్ అయినా కూడా బాధపడతారు కానీ ఓ స్టార్ హీరో సినిమా ఆగిపోయినందుకు ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు.. ఆ సినిమా ఏంటి అన్నది చూడాలంటే ఈ న్యూస్ చూడాల్సిందే. టాలీవుడ్ రీమేక్ స్పెషలిస్ట్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన రీమేక్ చేస్తే సినిమా రిజల్ట్ వేరే రేంజ్ లో ఉంటుంది.

పవర్ స్టార్ Pawan Kalyan లాస్ట్ టూ మూవీస్ వకీల్ సాబ్, భీంలా నాయక్ రెండు సినిమాలు రీమేక్ చేయబడ్డాయి. ఇక లేటెస్ట్ గా మరో రీమేక్ కి పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం క్రిష్ డైరక్షన్ లో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ ఆ సినిమాతో పాటుగా తమిళ సూపర్ హిట్ మూవీ వినోదయ సీతం రీమేక్ గా చేస్తున్నారని టాక్. మాత్రుక దర్శకుడు సముద్రఖనినే తెలుగు వర్షన్ ని కూడా డైరెక్ట్ చేస్తారని టాక్.

అయితే ప్రస్తుతం పవన్ (Pawan Kalyan) పొలిటికల్ గా కూడా పూర్తి ఫోకస్ తో ఉన్నాడు. అక్టోబర్ నుంచి ఏపీ మొత్తం యాత్ర చేయాలని భావిస్తున్నాడు. అయితే ఈ క్రమంలో ముందు అనుకున్న వినోదయ సీతం రీమేక్ ఆలోచనని పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఆ రీమేక్ సినిమా చేయడం ఇష్టం లేని పవర్ స్టార్ ఫ్యాన్స్ సినిమా క్యాన్సిల్ అని వార్తలు రాగానే హమ్మయ్య అనేసుకుంటున్నారు.

Tags: Pawan kalyan, Powerstar Pawan Kalyan, PSPK, Tollywood, Vinodaya Sitham