Raviteja : శ్రీలీలకి సైగ చేసిన రవితేజ.. మాములు రచ్చ కాదు..!

మాస్ మహరాజ్ రవితేజ (Raviteja) హీరోగా నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో వస్తున్న సినిమా ధమాకా. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. పెళ్లిసందడి సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన శ్రీలీల తెలుగులో వరుస ఛాన్సులు అందుకుంటుంది. ధమాకా సినిమాలో రవితేజతో శ్రీలీల రొమాన్స్ పీక్స్ లో ఉంటుందని అంటున్నారు. ఈమధ్యనే జింతాక్ సాంగ్ తో రెచ్చిపోయిన శ్రీలీల లేటెస్ట్ గా సినిమా నుంచి వచ్చిన టీజర్ గ్లింప్స్ తో మెప్పించారు.

రవితేజ, శ్రీలీల సైగలతో రొమాంటిక్ గా కట్ చేసిన ఈ టీజర్ గ్లింప్స్ సినిమాపై క్రేజ్ ని తీసుకొచ్చింది. శ్రీలీలకి తెలుగులో మంచి పాపులరిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక క్రాక్ సినిమాతో హిట్ అందుకున్న రవితేజ ఖిలాడి, రమారావు సినిమాలతో మళ్లీ వరుస ఫ్లాపులు అందుకున్నాడు. అయితే దమాకా పూర్తిగా రవితేజ మార్క్ స్టైల్ లో ఈ సినిమా వస్తుంది. అందుకే సినిమాపై మాస్ రాజా ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు.

రవితేజ ఇక మీదట కథల విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉండాలని ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాలో రవితేజ (Raviteja) పాత్ర మాస్ ఆడియెన్స్ ని మెప్పిస్తుందని చెబుతున్నారు. ధమాకా ఈ ఇయర్ ఎండింగ్ కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

Tags: Dhamaka, Dhamaka Movie, Mass Maharaj, RaviTeja, Raviteja Dhamaka, Srileela, Tollywood, Trinatha Rao