పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద చాలా ఆశలు పెట్టుకుంది తెలుగు అమ్మాయి పూజిత పొన్నాడ (Poojitha). ఆల్రెడీ తెలుగులో అడపాదడపా ఛాన్సులతో అలరిస్తున్న పూజిత ఏమాత్రం గుర్తింపు లేని పాత్రలతో కెరియర్ వెళ్లదీస్తుంది. ఇక ఈ క్రమంలో అమ్మడికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమాలో ఛాన్స్ వచ్చిందట. సినిమాలో పూజిత ఓ స్పెషల్ సాంగ్ లో నర్తిస్తుందని తెలుస్తుంది.
క్రిష్ డైరక్షన్ 17వ శతాబ్ధం నాటి కథతో ఫిక్షనల్ స్టోరీగా హరి హర వీరమల్లు సినిమా వస్తుంది. ఈ సినిమాని ఏ.ఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ అందాల భామ జాక్వెలిన్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుంది. పూజిత పొన్నాడ స్పెషల్ సాంగ్ కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది.
పూజితకు ఈ మెగా ఛాన్స్ అమ్మడి కెరియర్ కి మంచి బూస్టప్ ఇస్తుందని చెప్పొచ్చు. ఇన్నాళ్లు చిన్న చిన్న సినిమాలతో కెరియర్ వెళ్లదీసిన పూజిత పొన్నాడ (Poojitha) పవర్ స్టార్ సినిమాతో క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తుంది.