Liger : అవి బూడిదలో పోసిన పన్నీరేనా.. లైగర్ కోసం మైక్ టైసన్ కి అంత ఇచ్చారా..!

విజయ్ దేవరకొండ హీరోగా పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ కలిసి నిర్మించిన సినిమా లైగర్ (Liger ). విజయ్ దేవరకొండ సర్సన అనన్యా పాండే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా రీసెంట్ గా రిలీజై డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు ఏర్పరచి సినిమాలో విషయం లేకపోయే సరికి ప్రేక్షకులు తిప్పికొట్టారు.

ఇక ఈ Liger సినిమాలో మైక్ టైసన్ కూడా నటించారు. సినిమాలో చివర్లో ఆయన జస్ట్ ఇలా వచ్చి అలా వెళ్లారు. అయితే ఆ పాత్రకి మైక్ టైసన్ కి భారీ రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దాదాపు లైగర్ సినిమా కోసం పాతిక కోట్ల దాకా టైసన్ కి ముట్టచెప్పారట. అంత పెట్టి తీసుకున్నా సినిమాలో ఏదైనా ఇంపార్టెంట్ రోలా అంటే అది కాదు.

పూరీ లైగర్ కోసం తీసుకున్న వరస్ట్ డెశిషన్ అదని చెప్పొచ్చు. సినిమాలో మైక్ టైసన్ ఉన్నాడని అంచనాలు పెరిగాయి. కానీ సినిమా చూస్తే అతన్ని సరిగా వాడుకోలేదని ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఫైనల్ గా లైగర్ డిజాస్టర్ కా బాప్ అనేలా మిగిలింది. విజయ్ దేవరకొండ ఖాతాలో హ్యాట్రిక్ ఫ్లాప్ పడ్డది.

Tags: ananya pandey, liger, Mike Remuneration, Mike Tyson, puri jagannath, Vijay Devarakonda