మాస్ మహరాజ్ రవితేజ (Raviteja) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ధమాకా పూర్తి చేసే పనిలో ఉన్న ఆయన మరోపక్క రావణాసుర, టైగర్ నాగేశ్వర రావు సినిమాలు చేస్తున్నాడు. టైగర్ సినిమా మాత్రం పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమాలతో పాటుగా ఓ హాలీవుడ్ సినిమా రీమేక్ ని చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇంతకీ రవితేజ చేస్తున్న హాలీవుడ్ మూవీ ఏంటి అంటే జాన్ విక్ అని తెలుస్తుంది.
2014 లో రిలీజైన ఈ సినిమా యాక్షన్ మూవీగా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు రవితేజ. ఈ సినిమాని కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాకు ఈగల్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.
ఇక ఈ మూవీలో Ravitejaకి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుందట. క్రాక్ తర్వాత ఖిలాడి, రామారావు సినిమాలతో నిరాశపరచిన రవితేజ రానున్న సినిమాలతో అలరించాలని చూస్తున్నారు. ఈగల్ టైటిల్ కూడా అదిరిపోగా సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. రవితేజ కథల విషయంలో చాలా జాగ్రత్తపడుతున్నట్టు తెలుస్తుంది. ధమాకా మాత్రం రవితేజ మార్క్ ఎంటర్టైనింగ్ మూవీగా వస్తుంది.