ప్రస్తుతం బాలీవుడ్ లో బాయ్ కాట్ ట్రెండ్ కొనసాగుతోంది.. ఎవరైనా హీరో హీరోయిన్లు లేదా దర్శకులు తమకు నచ్చకపోతే.. వారి సినిమాలకు సోషల్ మీడియాలో బాయ్ కాట్ కు పిలుపు ఇస్తున్నారు. చిన్నచిన్న కారణాలకే బాయ్ కాట్ అని ట్రెండ్ చేస్తున్నారు. ఎవరైన హీరో గతంలో ఏదైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసుంటాడు. అది ఎప్పుడో జరిగి ఉంటుంది. కానీ ఆ హీరో సినిమా వస్తుందంటే చాలు.. ఆ హీరో అంటే నచ్చని వారు ఒక్కటై.. సినిమాపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో బాయ్ కాట్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ బాయ్ కాట్ ట్రెండ్ బాలీవుడ్ పెద్ద హీరోలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ట్రెండ్ కి ఇటీవల భారీ చిత్రాలు బలయ్యాయి. రీసెంట్ గా అమీర్ ఖాన్ హీరోగా నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా ఈ బాయ్ కాట్ ట్రెండ్ లో కొట్టుకుపోయింది.
తాజాగా రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ హీరో, హీరోయిన్లుగా అమితాబ్, నాగార్జున కీలక పాత్రల్లో నటించిన సినిమా బ్రహ్మాస్త్ర.. గత కొన్ని రోజులుగా ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలని సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు. ఎందుకంటే.. గతంలో రణ్ వీర్ కపూర్, ఆలియా భట్ బీఫ్ తినే విషయంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో ‘బ్రహ్మాస్త్ర’ను బాయ్ కాట్ చేయాలని పిలుపునచ్చారు. అంతేకాదు ఈ సినిమా విడుదల సందర్భంగా వీరు మహా కాళేశ్వరుని దర్శనం కోసం వెళ్లారు. అక్కడ కొంత మంది వీరిని అడ్డుకున్నారు. గో బ్యాక్ అని నినాదాలు కూడా చేశారు.
అంతేకాదు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫ్యాన్స్ కూడా ప్రతికారం తీర్చుకోవాలని అనుకున్నారు. ఆయన మరణానికి పరోక్షంగా కారణమైన వారిపై రివేంజ్ తీర్చుకోవాలని చూశారు. వీటితో పాటు ఆలియా భట్ తల్లి సోనీ రజ్దాన్ తనకు ఇండియా కంటే పాకిస్తాన్ లో ఉండటమే నచ్చుతుందని వ్యాఖ్యానించారు. మరోవైపు ఆలియా భట్ కూడా తన సినిమాలు నచ్చకపోతే చూడకండి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ కారణాలతో ‘బ్రహ్మాస్త్ర’ సినిమాను బాయ్ కాట్ చేయాలని ట్రెండ్ చేశారు. అయితే సినిమాను ఫ్లాప్ చేయాలిన ఎంత ప్రయత్నించినా అవి ఫలించలేదు.. ఈ బాయ్ కాట్ ట్రెండ్ ని దాటి బ్రహ్మాస్త్ర సూపర్ హిట్ అయ్యింది.
ఈనేపథ్యంలో నాగార్జున ఈ బాయ్ కాట్ ట్రెండ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. సినిమా బాగుంటే ఎలాంటి నెగిటివ్ ప్రచారాలు చేసినా అది హిట్ అవుతుందని అన్నారు. ఇండస్ట్రీపై బాయ్ కాట్ ట్రెండ్ అంతగా ప్రభావం చూపిస్తుందని తాను అనుకోవడం లేదన్నారు. బాలీవుడ్ లో గంగూభాయ్ కతీయవాడి, భూల్ భులయ్యా-2 సినిమాలు సక్సెస్ సాధించాయన్నారు. అయితే ‘లాల్ సింగ్ చడ్డా’ బాగాలేదు కాబట్టే ఆడలేదని, బాయ్ కాట్ ట్రెండ్ వల్ల మాత్రం ఫ్లాప్ అవ్వలేదన్నారు. ఇప్పుడు ‘బ్రహ్మాస్త్ర’ అడుతుంది కదా అంటూ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..