Anupama : అనుపమ కూడా బాగా పెంచేసిందట..!

సినిమా పరిశ్రమలో హిట్ పడితే వారికి వచ్చిన క్రేజ్ తో రెమ్యునరేషన్ పెంచడం సర్వ సాధారణం. ఈ క్రమంలో మళయాళ భామ అనుపమ పరమేశ్వరన్ కూడా రీసెంట్ హిట్ తో రెమ్యునరేషన్ డబుల్ చేసిందని టాక్. కార్తికేయ 2 సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటుగా నేషనల్ వైడ్ గా అనుపమకి సూపర్ ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకే అమ్మడు తన రెమ్యునరేషన్ కూడా పెంచేసిందని తెలుస్తుంది. కార్తికేయ 2 ముందు రౌడీ బోయ్స్ సినిమా చేసిన అనుపమ దాదాపు కెరియర్ అయిపోయిందనే వార్తలు వచ్చాయి.

కానీ అమ్మడు మళ్లీ హిట్ తో బౌన్స్ బ్యాక్ అయ్యింది. కార్తికేయ 2 హిట్ అనుపమ కెరియర్ ని టర్న్ తిప్పింది. ఇప్పుడు Anupamaకు వరుస అవకాశాలు వస్తునాయి. రవితేజ చేస్తున్న ఈగల్ సినిమాలో అనుపమ హీరోయిన్ గా చేస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాలో నటించేందుకు అనుపమ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. అంతకుముందు సినిమాకు 60 నుంచి 75 లక్షల దాకా తీసుకునే అనుపమ ఇప్పుడు కోటికి పైగా డిమాండ్ చేస్తుందట.

యువ హీరోలకి పర్ఫెక్ట్ జోడీ అనిపించుకుంటున్న Anupamaకి ఇప్పుడు అడిగినంత ఇచ్చి మరి తమ సినిమాల్లోకి తీసుకుంటున్నారట. మరి మొత్తానికి మళ్లీ అనుపమకి మంచి రోజులు వచ్చాయని చెప్పొచ్చు. అనుపమ చేస్తున్న ఈ సినిమాలతో ఆమె కెరియర్ తిరిగి ఫాం లోకి రావాలని ఆశిద్దాం.

Tags: Anupama, Anupama Parameswaran, Anupama Remuneration, Tollywood