వెంకటేష్ వదులుకున్న సినిమాతో బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టిన రవితేజ… ఆ సినిమా ఇదే…!

టాలీవుడ్ లోనే మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరోల‌లో రవితేజ కూడా ఒక‌రు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి మాస్ మహారాజా గా తనకంటూ ఓ స్టార్ డం క్రియేట్ చేసుకున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వ‌చ్చిన‌ ఇడియట్ సినిమాతో స్టార్ హీరోగా మారాడు. ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న రవితేజ మధ్యలో వరుస అపజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు.

Watch Krack Full Movie Online in HD Quality | Download Now

అలా వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న మాస్ మహారాజాకు సాలిడ్ కం బ్యాక్ ఇచ్చిన సినిమా క్రాక్. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ర‌వితేజ‌ ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించాడు. ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్గా నటించిగా శృతిహాసన్ హీరోయిన్‌. క్రాక్‌ సినిమా రవితేజ కేరీర్‌లోనే అత్యధిక కలెక్షన్ సాధించింది. ఆ త‌ర్వాత ధ‌మాకా దీనిని బీట్ చేసింది.

ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త చాలా మందికి తెలియ‌దు. వాస్తవానికి ఈ సినిమాను ముందుగా చేయాల్సింది విక్టరీ వెంకటేష్ అట.. గతంలో వెంకటేష్ తో గోపీచంద్ మలినేని బాడీగార్డ్ సినిమా తెరకెక్కించాడు. సినిమా దగ్గరనుంచి వీరిద్దరి మధ్య మంచి సాహిత్యం కుదిరింది. ఆ సాన్నిహిత్యంతో క్రాక్ కథను ముందుగా ఆయన వెంకీకిి చెప్పాడట. ఆ సమయంలో వరుస‌ సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా వెంకీ ఆ సినిమాను వదిలేసుకున్నారట.

Ravi Teja And Shruti Haasan's Krack Is a Big Hit | Filmfare.com

వెంకటేష్ నో చెప్పటంతో.. వెంటనే గోపీచంద్ మలినేని ఆ స్టోరీని రవితేజకు చెప్పాడు. అప్పటికే వీరి కాంబోలో వచ్చిన డాన్ శీను- బలుపు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. దీంతో ఈ సినిమాకు కూడా రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అలా రవితేజ ఒప్పుకోవడం వల్ల‌ ఇద్దరికీ ఈ సినిమాతో మరో హ్యాట్రిక్ హిట్ పడింది. ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వర రావు సినిమాలో నటిస్తున్నారు.