‘ ఆదిపురుష్ ‘ తెలుగు థియేట్రిక‌ల్ బిజినెస్ చూస్తే క‌ళ్లు జిగేల్‌… ఏందీ ప్ర‌భాస్ ఈ క్రేజ్‌…!

టాలీవుడ్ యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. అస‌లు ప్ర‌భాస్ భీక‌ర‌మైన లైన‌ప్ చూస్తుంటే బాలీవుడ్ బ‌డాస్టార్ల‌కే నిద్ర‌లు ప‌ట్ట‌డం లేదు. బాహుబ‌లి సీరిస్ సినిమాల త‌ర్వాత ప్ర‌భాస్‌కు నేష‌న‌ల్ వైడ్‌గా తిరుగులేని సూప‌ర్ స్టార్ డ‌మ్ వ‌చ్చేసింది. బాహుబలి 1,2 త‌ర్వాత వ‌రుస‌గా సాహో, రాధేశ్యామ్ లాంటి పాన్ ఇండియా సినిమాల్లో న‌టించాడు.

Kriti Sanon Planet 💫 on Twitter: "@omraut All the best for #Adipurush sir  🚩 #Prabhas #KritiSanon https://t.co/KynYoVm9qr" / Twitter

ఇప్పుడు ప్ర‌భాస్ లైన‌ప్ కూడా అంతే స్ట్రాంగ్‌గా ఉంది. ముందుగా ప్ర‌భాస్ న‌టిస్తోన్న ఆదిపురుష్ రిలీజ్ కానుంది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా స‌లార్‌, ప్రాజెక్ట్ కే, స్పిరిట్‌, మారుతి సినిమా, బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ల సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇక ఆదిపురుష్ సినిమా స్టార్టింగ్ నుంచి పెద్ద‌గా అంచ‌నాలు లేవు. అస‌లు ఈ సినిమాకు బిజినెస్ అయినా స‌రిగా జ‌రుగుతుందా ? అన్న అనుమానాలూ ఉన్నాయి.

ఇండియ‌న్ సినిమా ట్రేడ్ కాన్‌సంట్రేష‌న్ అంతా స‌లార్‌, ప్రాజెక్ట్ కే మీదే ఎక్కువుగా ఉండేది. ఎప్పుడు అయితే ఆదిపురుష్ ట్రైల‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చిందో వెంట‌నే ఈ సినిమా హైప్ స్కై రేంజ్‌కు వెళ్లిపోయింది. యూట్యూబ్‌లో ఆదిపురుష్ ట్రైల‌ర్ రికార్డులు బ్రేక్ చేస్తూ దూసుకుపోతోంది. ఇక వ‌చ్చే నెల 16న ఆదిపురుష్ రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే.

Adipurush' makers launch new poster of Prabhas, Kriti Sanon and Sunny Singh  on Ram Navami- The New Indian Express

ఈ క్ర‌మంలోనే తెలుగు వెర్ష‌న్‌కు సంబంధించి ఆదిపురుష్‌కు దిమ్మ‌తిరిగే రేంజ్‌లో థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రుగుతోంద‌ట‌. ఏకంగా రు. 150 కోట్ల రేంజ్‌లో ఏపీ, తెలంగాణ రైట్స్ అమ్ముడ‌వుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఆదిపురుష్ తెలుగు హక్కుల పంపిణీని యూవీ క్రియేషన్స్ చూస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో యూవీ వాళ్లు తమ సొంత డిస్ట్రిబ్యూటర్లకే సినిమాను ఇస్తున్నారు.

కేవ‌లం తెలుగు వెర్ష‌న్‌కే రు. 150 కోట్ల బిజినెస్ అంటే మామూలు రికార్డ్ కాదు. ప్ర‌భాస్ రేంజ్‌, క్రేజ్ ఏ స్థాయిలో ఉందే చెప్పేందుకు ఇవే పెద్ద నిద‌ర్శ‌నం.