చైతూకు డేట్లు ఇవ్వని రష్మిక ?

సాధారణంగా ఏ సినిమా అయినా హీరో కాల్షీట్లను బట్టి స్టార్ట్ అవుతుంది. అయితే నాగ చైతన్య సినిమా పరిస్థితి వేరు.14 రీల్స్‌ బ్యానర్‌పై పరశురామ్‌ దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్‌ చేస్తోంది. లైన్‌ వినిపించగా కథ ఇంకా డెవలప్‌ కావాల్సి ఉంది. అయితే సినిమా ప్రారంభించాలంటే రష్మిక తన డేట్స్ అడ్జస్ట్ చేసుకోవాలి.

ప్రస్తుతం నాగ చైతన్య వెంకట్ ప్రభు సినిమాతో బిజీగా ఉన్నాడు. రష్మిక తదుపరి చిత్రానికి ఫిక్స్ అయ్యింది. అయితే ఆమె ఎప్పుడు డేట్స్ కేటాయిస్తుందో ఎవరికీ తెలియదు.సమంత, సాయి పల్లవితో చేసిన సినిమాలు విజయవంతమైన తర్వాత నాగ చైతన్య హీరోయిన్ల కాంబినేషన్‌పై నమ్మకం పెట్టుకున్నాడు.

బంగార్రాజు సక్సెస్ తర్వాత వెంకట్ ప్రభు సినిమాతో కృతి శెట్టి మళ్లీ రిపీట్ అవుతోంది. కాబట్టి రష్మిక డేట్స్ మేకర్స్ మరియు హీరోకి చాలా అవసరం.

Tags: Naga Chaitanya, Rashmika Mandanna, tollywood news