Divi : దివి లేటెస్ట్ ఫోటో షూట్.. చూపులతో మాయ చేస్తుంది..!

బిగ్ బాస్ సీజన్ 4లో అలరించిన దివి (Divi ) ఆ క్రేజ్ తో వరుస అవకాశాలు అందుకుంటుంది. సినిమాల్లో పెద్దగా ఛాన్సులు రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం అమ్మడు అదరగొడుతుంది. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో దివి ఛాన్స్ అందుకుంది. ఇంకా రెండు సినిమాల దాకా చేస్తుంది. ఓ సినిమాలో ఫీమేల్ లీడ్ గా కూడా నటిస్తుంది.

సినిమాలు ఎలా ఉన్నా అమ్మడు సోషల్ మీడియాలో అమ్మడు రచ్చ చేస్తుంది. తన ఫోటో షూట్స్ తో ఆడియెన్స్ కి నిద్ర పట్టకుండా చేస్తుంది దివి. లేటెస్ట్ గా దివి (Divi ) మరో క్రేజీ ఫోటో షూట్ తో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసింది. పెద్దగా గ్లామర్ షో ఏమి చేయకపోయినా చూపులతో మాత్రం కట్టిపడేస్తుంది. వైట్ అవుట్ ఫిట్ తో ఓర చూపులతో దివి వాద్య చేసిన ఈ లేటెస్ట్ ఫోటో షూట్ ఫ్యాన్స్ ని అలరిస్తుంది.

తనదైన హావ భావాలతో దివి చేస్తున్న ఈ ఫోటో షూట్స్ కి క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే అమ్మడికి ఇంకా సరైన గుర్తింపు మాత్రం రాలేదని చెప్పాలి. మోడల్ గా కెరియర్ మొదలు పెట్టి చిన్న చితకా పాత్రలు చేస్తూ వస్తున్న దివి సోలో హీరోయిన్ గా సత్తా చాటాలని ప్రయత్నిస్తుంది.

 

Tags: BiggBoss Divi, Divi, Divi Hot Show, Divi Updates, Divi Vadthya, Tollywood