Jubilee hills Soceity : ప్రస్తుత అధ్యక్షుడి తీరు.. పంతానికి పోయి కోర్టులో పరువు పోయిన వైనం. తాజాగా సొసైటీ నుంచి 800 వందల మంది సభ్యులను తొలగిస్తూ వివాదాస్పద నిర్ణయం. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ సొసైటీలో ప్రస్తుతం చీప్ పాలిటిక్స్ నడుస్తున్నాయి.ప్రస్తుత అధ్యక్షుడి రవీంద్రనాథ్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తనకి నచ్చని వారిపై ఏలాగైనా బురదజల్లి ,అప్రతిష్ట పాలు చేసి ఎలాగైనా సొసైటీ నుంచి వెళ్లగొడదామనుకున్న ఆయనకు హై కోర్టు తీర్పు మింగుడు పడడం లేదు.తాజాగా గురువారం
జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ సభ్యునిగా మురళీ ముకుంధ్ తొలగింపుపై , హై కోర్టు తీర్పు ప్రస్తుత అధ్యక్షుడితో పాటు మరికొంత మంది సభ్యులకు షాక్ కొట్టినంత పనయ్యింది.
ఎ.మురళీ ముకుంద్ ని తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకూ జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సభ్యునిగా కొనసాగించాలని హైకోర్ట్ ఆదేశాలు జారీచేసింది. WP నం. 37576/2022 ప్రకారం 28.09.2022న గౌరవనీయ హైకోర్ట్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ప్రస్తుత సెక్రటరీ ఎ. మురళీ ముకుంద్ సభ్యునిగా పరిగణించబడతారు. 18.09.2022 జనరల్ బాడీ మీటింగ్‌లో జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ప్రస్తుత కార్యదర్శి ఎ.మురళీ ముకుంద్ ని ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించడంపై కోర్టుని ఆశ్రయించారు.
17.09.2022 న ఎ.మురళీ ముకుంద్ ని జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ షోకాజ్ నోటీసు మరియు ఎటువంటి తీర్మానాన్ని ఆమోదించలేదని జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ తరఫు న్యాయవాది కోర్టుకి తెలిపారు. జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఎ.మురళీ ముకుంద్ తొలగింపునకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ తరఫు న్యాయవాది కోర్టుకి తెలిపారు.
జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ 18.09.2022న విడుదల చేసిన మునుపటి ప్రెస్ నోట్ తప్పుదారి పట్టించే విధంగా ఉందని రుజువైంది. పైన వెలువడిన ఆదేశాలు, 18.09.2022 జనరల్ బాడీ సమావేశం సందర్భంగా జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించబడిన ఇతర సభ్యులకు కూడా వర్తిస్తాయి. ఈ కేసు తదుపరి విచారణను గౌరవ హైకోర్ట్ అక్టోబర్ 10, 2022 కి వాయిదా వేసింది.ఎలాగైనా పాత ప్యానల్ సభ్యులపై తమ కోపాన్ని, కక్ష్యాని తీర్చుకోవాలన్న తన లక్ష్యం నెరవేరక విచక్షణ మర్చిపోయి వివాదాస్పద నిర్ణయాలకు దిగుతున్నారు.
హై కోర్టులో తమ పప్పులు ఉడకవని తెలిసిపోవడంతో సొసైటీ నుంచి 800 వందల మంది సభ్యుల తొలగింపు అధ్యక్షుడు రవీంద్రనాథ్ తీసుకున్న నిర్ణయం పై సభ్యులు భగ్గుమంటున్నారు.
అయితే ఈ పరిణామాలన్నీ సొసైటీకి చెడ్డ పేరు తీసుకొస్తాయని సభ్యులు వాపోతున్నారు.ఆయన వ్యక్తిగత స్వార్థం కోసం సొసైటీ ప్రతిష్ఠను పణంగా పెడుతున్నాడని మండిపడుతున్నారు.
గతంలో సొసైటీకి అధ్యక్షుడిగా పని చేసిన ప్యానల్ సభ్యులపై ఎన్నో ఆరోపణలు చేసినా ఒక్కటి సైతం నిరూపించకపోవడంతో పాటు వారిని ఏకపక్షంగా ఐదుగురి సభ్యులను తొలగించం వంటి అనైతిక చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల్లో సోసైటీ అభివృద్ధి చేస్తానని ఎన్నికల్లో హామీలిచ్చి ,అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి అంశాన్ని పక్కకు పెట్టి పనికి మాలిన పనులకు పూనుకుంటున్నాడని విమర్శలు చేస్తున్నారు.ఇకనైనా ప్రస్తుత అధ్యక్షుడు బీ రవీంద్రనాథ్ సొసైటీకి అక్కర్లేని పనులను పక్కకు పెట్టి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నారు.