Rashmika : రష్మిక సినిమా ఫస్ట్ లుక్ చూశారా..!

కన్నడలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో స్టార్ గా ఎదిగిన రష్మిక మందన్న (Rashmika) ఇప్పుడు బాలీవుడ్ లో కూడా సత్తా చాటాలని చూస్తుంది. అమ్మడు చేస్తున్న బాలీవుడ్ సినిమాల నుంచి క్రేజీ అప్డేట్స్ ఫ్యాన్స్ ని అలరిస్తున్నాయి. రష్మిక మందన్న హిందీలో చేస్తున్న సినిమా గుడ్ బై. ఈ సినిమాలో అమితాబ్ కూడా నటిస్తున్నారు. వికాస్ బాల్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

గుడ్ బై ఫస్ట్ లుక్ పోస్టర్ తో బాలీవుడ్ ఆడియెన్స్ ని మెప్పించింది రష్మిక మందన్న. అమితాబ్ చేసే కాన్సెప్టెడ్ మూవీస్ అన్ని బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తున్నాయి. ఆ కోవర్లోనే అమితాబ్ రష్మిక కలిసి చేస్తున్న ఈ గుడ్ బై కూడా సూపర్ హిట్ అవుతుందని చెప్పొచ్చు. ఈ ఫస్ట్ లుక్ లో రష్మిక న్యాచురల్ లుక్ హిందీ ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. తప్పకుండా అమ్మడికి సౌత్ లో వచ్చిన క్రేజ్ కంటే బాలీవుడ్ లో డబుల్ ఇమేజ్ ఏర్పడుతుందని చెప్పొచ్చు.

ప్రస్తుతం తెలుగులో దళపతి విజయ్ వారసుడు సినిమా చేస్తున్న రష్మిక (Rashmika) దానితో పాటుగా రెండు పెద్ద సినిమాల డిస్కషన్స్ లో ఉన్నట్టు తెలుస్తుంది. విజయ్ దేవరకొండ సుకుమార్ సినిమాలో కూడా రష్మిక హీరోయిన్ గా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట.

Tags: amitabh bachchan, Bollywood, Good Bye, Good Bye Poster, Rashmika, Rashmika Mandanna, Vikas Bahl