బాలీవుడ్ స్టార్స్ రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్రం’. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. కింగ్ నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాను భారీ బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్ తో రూపొందించారు. తెలుగులో ఈ మూవీని దర్శధీరుడు రాజమౌళి సమర్పిస్తున్నారు..ఈ సినిమా ప్రమోషన్స్ కి జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు..
ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఈవెంట్ కి అభిమానులు రాలేకపోయినందుకు ముందుగా వారికి క్షమాపణలు చెప్పారు. అమితాబ్ బచ్చన్, రణ్ బీర్ కపూర్, ఆలియా భట్, నాగార్జునలపై తారక్ ప్రశంసలు కురిపించారు. తాను అమితాబ్ కి పెద్ద అభిమాని అని తెలిపారు. ఆయన ఇంటెన్సిటీని బాగా ఎంజాయ్ చేస్తానని అన్నారు. ఇండియన్ సినిమాలో ఆయన ఒక మార్క్ ని క్రియేట్ చేశారని ప్రశంసించారు.
అమితాబ్ తర్వాత తాను బాగా కనెక్ట్ అయిన నటుల్లో రణ్ బీర్ కపూర్ ఒకరని అన్నారు. రణ్ బీర్ నటించిన ప్రతి చిత్రం తనకు ఎంతో స్ఫూర్తినిస్తుందని తెలిపారు. ఆయన నటించిన మూవీస్ లో ‘రాక్ స్టార్’ తన ఫేవరేట్ అని చెప్పారు. అందులో రణ్ బీర్ ఇంటెన్సిటీ చాలా బాగుంటుందని అన్నారు. ఆయనతో ఇలా హైదరాబాద్ లో స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. రణ్ బీర్ జర్నీ బ్రహ్మస్త్రతో ఆగదని, ఆయన మరింత గొప్ప స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఇక ఆలియా భట్ గురించి చెబుతూ.. ఆమె ఓ ఫైనెస్ట్ యాక్టర్ అన్నారు. ఆమె ఓ జెమ్ పర్సన్..ఆమె కెరీర్ లో ఈ సినిమా గొప్ప మైలురాయి లాంటి చిత్రం అవుతుందని అన్నారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ గురించి మాట్లాడుతూ.. ఆయన సినిమా కోసం చివరి నిమిషం వరకు తపిస్తున్నారని భావిస్తున్నానని అన్నారు. రాజమౌళి కూడా అలానే చేస్తారన్నారు.
నాగార్జున బాబాయ్ హిందీలో నటించిన ‘ఖుదా గవా’ సినిమా తనకు ఎంతో ఇష్టమన్నారు. ఒక తెలుగు నటుడు హిందీ మూవీ చేసి.. అందులో హిందీ మాట్లాడితే ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ ఉండేదని అన్నారు. నాగార్జున ఎన్నో గొప్ప సినిమాలు చేశారని, నటుడిగా, స్టార్ గా ఆయన గురించి చెప్పే వయసు నాది కాదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సినీ పరిశ్రమ ఒత్తిడి ఎదుర్కొంటుందని, ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారని తెలిపారు. ప్రేక్షకులకు గుడ్ అండ్ గ్రేట్ మూవీస్ ఇవ్వగలుగుతామన్నారు. ఈ ఛాలెంజ్ ని ప్రతిఒక్కరూ అంగీకరిస్తారని తాను నమ్ముతన్నానని తారక్ చెప్పుకొచ్చారు.