డిజాస్టర్ తర్వాత కూడా పూరినే అంటిపెట్టుకున్న ఛార్మి.. వారి బంధం విడదీయరానిది!

2015లో విడుదలైన ‘జ్యోతి లక్ష్మి’ సినిమాని పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో టైటిల్ రోల్‌లో ఛార్మీ కౌర్ నటించింది. అయితే ఈ సినిమా కోసం కలిసి పనిచేస్తున్న సమయంలో వీరి మధ్య ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. ఆ సినిమా నుంచి వీరి మధ్య స్నేహం మరింత బలపడుతూ వస్తోంది. ఎంతగా అంటే వీరిద్దరూ కలిసి పూరి కనెక్ట్స్ (PC) అనే ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీని స్థాపించి దానిని రన్ కూడా చేస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన లైగర్ సినిమాని పూరితో కలిసి ఛార్మీ కూడా నిర్మించింది. అయితే ఈ మూవీ అనూహ్యంగా డిజాస్టర్ కావడంతో పెట్టిన బడ్జెట్‌లో సగం కూడా ఇప్పటివరకు రికవర్ కాలేదట.

సరిగమ సినిమాస్ సంస్థ ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్‌ను రూ.6 కోట్లకు కొనుగోలు చేస్తే ఇప్పటివరకు రూ.3 కోట్లు కూడా కలెక్ట్ కాలేదట. అలా ఎంతో నష్టాలను మిగిల్చిన ఈ సినిమా వల్ల ఛార్మి పూరిపై కోపంగా ఉందని పలువురు అంటున్నారు. పూరిని నమ్ముకోవడం వల్ల ఇప్పటివరకు సంపాదించిన దాంట్లో సగం వరకు డబ్బులను ఆమె కోల్పోయిందని కూడా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. లైగర్ ప్రమోషన్స్‌లో ఇద్దరూ పాల్గొన్నా, ఒకరికొకరు ఎడమొహం పెడమొహం అన్నట్లుగా ఉంటున్నారని, వారి మధ్య మంచి సంబంధాలు లేవని టాక్ నడుస్తోంది.

అయితే ప్రస్తుతం సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేవు. ఇటీవలి కాలంలో వారు కొన్ని ప్రైవేట్ పార్టీలు, డిన్నర్ ఔటింగ్స్‌కు కూడా కలిసే హాజరయ్యారట. ఈ విషయాలను వెల్లడిస్తూ ఇప్పుడు హల్ చల్‌ చేస్తున్న పుకార్లలో ఎలాంటి నిజం లేదని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. పూరి జగన్, ఛార్మీ కౌర్ ఇద్దరూ ఇప్పుడు మంచిగా కలిసే ఉన్నారని, సినిమా పనుల్లో బిజీ అయిపోయారని అంటున్నారు. అయితే ఛార్మి పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న జనగణమన అనే సినిమాకి కూడా నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ సినిమా కూడా ఒక ప్రయోగాత్మక సినిమానే. ఇది కూడా ఫ్లాప్ అవుతే.. ఛార్మి నెత్తిన తువ్వాలే గతి అవుతుంది. అందుకే దానిని ఇప్పటికిప్పుడే పూరి అటకెక్కించాడని అంటున్నారు.

Tags: Charmi Kaur, liger movie, puri jagannath, Tollywood