Rashmika : 4 కోట్లు ఇస్తేనే.. పుష్ప 2 మేకర్స్ కి షాక్ ఇచ్చిన రష్మిక..!

Rashmika Demand 4 Crores for Pushpa 2 Makers Shock

సుకుమార్ డైరక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. పార్ట్ 1 ఎలాంటి సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే. పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న (Rashmika) సత్తా చాటింది. అమ్మడి అమాయకమైన అభినయం సినిమాకు ప్లస్ అయ్యింది. ఇక హీరో తో రొమాన్స్ ఓ రేంజ్ లో పండింది. పుష్ప హిట్ అవడంలో తన వంతు కృషి చేసింది రష్మిక. ఇక ఇప్పుడు చిత్రయూనిట్ పుష్ప 2కి రెడీ అవుతుంది.

పుష్ప 2 లొకేషన్స్ వేట కొనసాగుతుంది. త్వరలోనే పార్ట్ 2 పుష్ప ది రూల్ స్టార్ట్ కాబోతుంది. ఈ పార్ట్ లో కూడా రష్మిక పాత్ర చాలా ఇంపార్టెంట్ కాబోతుందట. అందుకే సినిమాలో నటించేందుకు రష్మిక 4 కోట్లు దాకా డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. పుష్ప 1 కోసం కోటిన్నర దాకా రెమ్యునరేషన్ తీసుకున్న రష్మిక (Rashmika)పార్ట్ 2 కోసం 4 కోట్లు డిమాండ్ చేస్తుందట. అడిగినంత ఇస్తేనే సినిమాలో చేస్తానని అంటుందట.

రష్మిక ఇచ్చిన షాక్ కి మేకర్స్ మైండ్ బ్లాక్ అయ్యిందని తెలుస్తుంది. రష్మిక మాత్రమే కాదు అల్లు అర్జున్, సుకుమార్ ల రెమ్యునరేషన్ కూడా పార్ట్ 2 కోసం భారీగా ఉందని తెలుస్తుంది. పుష్ప పార్ట్ 2 అనుకున్న దాని కన్నా మరింత గ్రాండ్ గా ఉండబోతుందని తెలుస్తుంది. పార్ట్ 2 ని 2023 సమ్మర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

Tags: allu arjun, Icon Star Allu Arjun, Pushpa 2, pushpa movie, Rashmika, Rashmika Mandanna, Srivalli, sukumar, Tollywood