Megastar : బింబిసార.. సీతారామం టీం లకు చిరు కంగ్రాట్స్..!

కొన్నాళ్లుగా ప్రేక్షకులు థియేటర్ కి రావడం లేదు సినిమాల పరిస్థితి ఏంటి.. థియేటర్ లో సినిమా చూడటానికి ఆడియెన్స్ ఇష్ట పడటం లేదా అన్న ఆలోచన వచ్చింది. అయితే నిన్న శుక్రవారం రిలీజైన రెండు సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా చోట్ల హౌజ్ ఫుల్ బోర్డ్ లు కూడా కనిపించాయి. కళ్యాణ్ రామ్ హీరోగా నటించి నిర్మించిన బింబిసార.. దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన సీతారామం రెండు సినిమాలు ప్రేక్షకుల మనసులు గెలిచాయి.

ఈ సినిమాల రిజల్ట్ తో తెలుగు చిత్ర పరిశ్రమలో ఉత్సాహం ఏర్పడింది. రెండు సినిమాలకు మంచి టాక్ రావడం విశేషం. ఈ విషయంపై ఈ రెండు చిత్రయూనిట్ లని అభినందిస్తూ కంగ్రాట్స్ చెప్పారు మెగాస్టార్ చిరంజీవి (Megastar). కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఎప్పుడైనా ఆదరిస్తారని ఈ రెండు సినిమాలు ప్రూవ్ చేశాయి. ఈ సందర్భంగా సీతారామం, బింబిసార చిత్రయూనిట్ కి నటీనటులకు, నిర్మాతలకు మెగాస్టార్ చిరంజీవి (Megastar) శుభాకాంక్షలు తెలిపారు.

ఈ రెండు సినిమాల ఫలితాలతో పరిశ్రమ లో కొత్త జోష్ వచ్చింది. కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాకు 6 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసింది. సో ఇక మీదట కూడా ఇదే రేంజ్ ఫలితాలు అన్ని సినిమాలు తెస్తాయని అంచనా వేయొచ్చు.

Tags: Bimbisara, Dulquer Salman, Kalyan Ram, Megastar Chiranjeevi, NTR Arts, Seetharamam, Tollywood, vyjayanthi movies