హను రాఘవపుడి డైరక్షన్ లో వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన సినిమా సీతారామం. మళయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ టీవీ యాక్ట్రెస్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. సినిమాలో సీత పాత్రలో ఆమె చూపించిన అభినయానికి ఆడియెన్స్ అందరు ఫిదా అవుతున్నారు. హను రాఘవపుడి ఓ అద్భుతమైన ప్రేమ కావ్యాన్ని తీశారని ప్రేక్షకులు అంటున్నారు.
సీతారామం సినిమాలో మృణాల్ ఠాకూర్ నటనకు మంచి పేరు వస్తుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఫస్ట్ ఆప్షన్ కాదని తెలుస్తుంది. సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో ఈ విషయాన్ని వెళ్లడించారు చిత్రయూనిట్. సీతారామం సినిమాలో సీత పాత్రలో బుట్ట బొమ్మ పూజా హెగ్దే (Pooja Hegde)ని అనుకున్నారట. పూజా కూడా సినిమా చేసేందుకు ఆసక్తి చూపించిందట. అయితే కొవిడ్ వల్ల సినిమా షూటింగ్ లేట్ అవడంతో ఆమె సినిమా నుంచి తప్పుకుందట.
సీతారామం సినిమాలో పూజా హెగ్దే (Pooja Hegde)చేస్తే ఎలా ఉండేదో కానీ ఈ సీత అదేనండి మృణాల్ ఠాకూర్ మాత్రం మెప్పించిందని చెప్పొచ్చు. పూజా హెగ్దే ఓ మంచి ఛాన్స్ మిస్సయిందని అనుకోవచ్చు. పూజా హెగ్దే కూడా వరుస క్రేజీ సినిమాలతో సత్తా చాటుతుంది. సీతారామం తర్వాత మృణాల్ కి తెలుగులో మంచి ఛాన్సులు వస్తాయని చెప్పొచ్చు.