బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ , దీపిక పదుకొనే కలిసి నటించిన సినిమా ” జవాన్ “. ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదలై మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. దీనిని డైరెక్టర్ అట్లీ తెరకెక్కించగా.. ప్రియమణి, విజయ్ సేతుపతి, నయనతార కీలక పాత్రలో నటించారు.
జవాన్ మంచి సక్సెస్ అందుకోవడంతో చిత్ర యూనిట్ సెలబ్రేషన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రీసెంట్ గా జవాన్ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో మూవీ టీం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి షారుక్, అట్లీ, విలన్ పాత్రలో నటించిన విజయ్ సేతుపతి తో పాటు దీపిక పదుకొనే కూడా హాజరయ్యింది. కాగా ఈ క్రమంలోనే ఆమె షారుఖ్ ని పట్టుకుని గట్టిగా ముద్దు పెట్టుకున్న ఫోటోను దీపిక తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.
దానికి దీపిక భర్త రణ్‌వీర్ సింగ్ స్పందించాడు. ” నా హృదయం ప్రేమతో నిండిపోయింది”అంటూ కామెంట్ చేశాడు. దీంతో అది చూసిన ప్రేక్షకులు భార్య వేరే మగాడికి ముద్దు పెడితే రణ్‌వీర్ అలా స్పందించాడేంటని షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram