టీడీపీ- జనసేన కూటమి దెబ్బతో వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ఎంత ఘోరంగా ఓడిపోబోతుందో అప్పుడే క్లారిటీ వచ్చేసింది. పవన్ – లోకేష్ కలిసి పెట్టిన ఒక్క ప్రెస్ మీట్ దెబ్బతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెట్టేస్తున్నాయి. పవన్ – లోకేష్ వేసిన యార్కర్ల దెబ్బతో వైసీపీకి చెందిన 42 వికెట్లు ఒకే దెబ్బతో పడిపోయాయి. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని ప్రకటించడంతో వైసీపీ నేతలు.. ఇంకా చెప్పాలంటే జనసేన ప్రభావం ఎక్కువుగా ఉన్న ప్రాంతాల్లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చడం వల్ల గెలిచిన ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో తమకు సీన్ లేదని క్లారిటీ వచ్చేసింది.
గత ఎన్నికల్లో ఏకంగా 50 సీట్లలో జనసేన ఎక్కువుగా ఓట్లు చీల్చడం వల్లే వైసీపీ గెలిచింది. ఇంకా చెప్పాలంటే 42 నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు తమ ప్రత్యర్థులపై వెయ్యి ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019లో వైసీపీ 151 నియోజకవర్గాల్లో గెలుపొందగా అందులో 42 చోట్ల వెయ్యి ఓట్లకు కాస్త అటూ ఇటూ ఓట్ల మెజారిటీతో వైసీపీ నేతలు గెలుపొందారు.
ఉదాహరణకు విజయవాడ సెంట్రల్‌లో వైసీపీ 25 ఓట్ల మెజారిటీతో గెలిచింది. అదే జనసేన లేకుండా ఉండి ఉంటే ఇక్కడ టీడీపీ 20 వేల ఓట్ల మెజార్టీతో గెలిచి ఉండేది. ఉభయ గోదావరి జిల్లాలనుంచిశ్రీకాకుళం,విజయనగరం,కర్నూలు,నెల్లూరు జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఇదే మెజారిటీ సాధించింది.
మాజీ మంత్రి అనిల్ కుమార్ కూడా కేవలం 1200 ఓట్ల తేడాతోనే గెలిచారు. అదే జనసేన పోటీ లేకుండా ఉండి ఉంటే నెల్లూరు సిటీలో టీడీపీ నుంచి మాజీ మంత్రి నారాయణ గెలిచేవారు. 2019లో వైసీపీ,జనసేన,టీడీపీ మధ్య ముక్కోణపు పోరు.టీడీపీ,జనసేన మధ్య ఓట్లు చీలిపోవడంతో వైసీపీ లాభపడింది… అదే ఆ ఓట్ల చీలిక లేకపోయి ఉంటే వైసీపీకి అంత మెజార్టీలు ఖచ్చితంగా వచ్చేవే కాదు.
టీడీపీ – జనసేన పొత్త ఉంటే తనకు డేంజర్ బెల్స్ అన్న విషయం జగన్ గ్రహించే అందుకే రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేయాలని సవాళ్లు రువ్వుతున్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏదేమైనా పవన్ లోకేష్, బాలయ్య సమక్షంలో విసిరిన ఒక్క యార్కర్‌కు వైసీపీ వాళ్లకు వణుకుతో కూడిన లైట్ పక్షవాతాలు అయితే మొదలయ్యాయి.