మోహన్ రాజా ఏంది కథ .. ఇలా అయితే గాడ్ ఫాదర్ సంగతేంది..!

ఆచార్య సినిమా చిరంజీవి అభిమానులకు ఒక పీడ కలను మిగిల్చింది. హీరోలకు ఎవరికైనా హిట్టు, ఫ్లాపు మామూలే. ఇందుకు చిరంజీవి కూడా అతీతుడు కాడు. ఆయన కెరీర్లో హిట్లతో పాటు ఫ్లాపులు కూడా ఉన్నాయి. కానీ ఆచార్య వంటి డిజాస్టర్ చిరంజీవి కెరీర్లో లేదు. రిక్షావోడు, బిగ్ బాస్, మృగరాజు వంటి ఫ్లాప్ సినిమాలు చిరంజీవికి చెడ్డ పేరు తెచ్చినప్పటికీ ఆ సినిమాలు కొద్ది రోజులు అయినా థియేటర్లలో ఆడడం తో పాటు అంతో ఇంతో కలెక్షన్స్ సాధించాయి. కానీ ఆచార్య మాత్రం దారుణ ఫలితాన్నిచ్చింది. ఆ సినిమాకు అభిమానుల నుంచి కనీస మద్దతు కూడా లభించలేదు.

కాగా ప్రస్తుతం చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే నెల 5వ తేదీన దసరా కానుకగా విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదలకు ఇంకా నెల రోజులే ఉన్నప్పటికీ ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ కాలేదు. ఒకవైపు నాగార్జున హీరోగా నటిస్తున్న ఘోస్ట్ సినిమా అదే రోజు విడుదల కానుండగా ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. ఘోస్ట్ నుంచి ఇప్పటికే టీజర్ రాగా లిరికల్ సాంగ్స్ కూడా విడుదల చేస్తున్నారు.

కానీ గాడ్ ఫాదర్ నుంచి టీజర్ తప్ప ఇంతవరకు ఫస్ట్ లిరికల్ సాంగ్ కూడా విడుదల కాలేదు. డైరెక్టర్ మోహన్ రాజా కూడా మీడియాలో ఎక్కడ కనిపించడం లేదు. సినిమాకు సంబంధించిన సంగతులు చెప్పడంలేదు. ఇప్పటికే ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతో అభిమానులు నిరాశ లో ఉండగా.. గాడ్ ఫాదర్ విడుదలకు నెలరోజులే ఉన్నప్పటికీ ఇంకా ప్రమోషన్స్ మొదలు పెట్టక పోవడం తో వారు మరింత నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికైనా గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచాలని డైరెక్టర్ కు సూచిస్తున్నారు.

Tags: Chiranjeei, chiranjeevi godfather, mega ster, tollywod movies, tollywood mega star, tollywood news