రానా, మిహికా మధ్య గొడవ జరిగిందా? క్లారిటీ ఇచ్చిన మిహిక..!

టాలీవుడ్ లో ప్రేమ వివాహం చేసుకున్న జంటల్లో దగ్గుబాటి రానా, మిహిక బజాజ్ దంపతులు కూడా వున్నారు. మిహికని ప్రేమించిన రానా ఇంట్లో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నాడు. కరోనా సమయంలో 2020 ఆగస్ట్ 8న వీరి వివాహం జరిగింది. వీరి దాంపత్యం అన్యోన్యంగా సాగుతోందని అంతా అనుకుంటున్న సమయంలో ఉన్నట్టుండి రానా, మిహికల మధ్య గొడవలు జరుగుతున్నాయని టాక్ మొదలైంది. పరోక్షంగా రానా కూడా దీనికి కారణం అయ్యాడు. మాములుగా రానా సోషల్ మీడియా, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వంటి ఖాతాల్లో చాలా యాక్టివ్ గా ఉంటాడు. అలాంటిది సరిగ్గా తమ పెళ్లి రోజుకు ఒకరోజు ముందు తన ఇన్ స్టాలో ఉన్న ఫోటోలను ఉన్నట్టుండి డిలీట్ చేశాడు. అంతటితో ఆగని రానా సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించాడు.

‘వర్క్ జరుగుతోంది సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్న’ అని రానా చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.పెళ్లికి ఒక రోజు ముందు ఇన్ స్టాలో ఫోటోలు డిలీట్ చేయడం, సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్నట్లు రానా ప్రకటించడంతో రానా, మిహిక మధ్య విబేధాలు వచ్చాయన్న పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు చేశాయి. దానికి తోడు పెళ్లి రోజు రానా కామ్ గా ఉండిపోయారు. దీంతో వారిద్దరి మధ్య ఏదో జరిగిందంటూ సోషల్ మీడియా వేదికగా చర్చించుకోవడం మొదలైంది.

అయితే వీటన్నిటికీ మిహిక ఒక క్లారిటీ ఇచ్చింది. తమ సెకండ్ యానివర్సరీ సందర్భంగా రానాతో కలసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలను చూసి వెంకటేష్ కూతురు ఆశ్రీత తో పాటు పలువురు సినీ ప్రముఖులు రానా, మిహిక దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లి రోజు ఆశ్రీత రానాతో కలసి దిగిన ఫోటోలు షేర్ చేయడంతో తమ మధ్య ఎలాంటి గ్యాప్ లేదని పరోక్షంగా తెలియజేసింది. తమ మధ్య ఏదో జరుగుతోందని వస్తున్న పుకార్లకు ఆమె చెక్ పెట్టింది. ఇప్పటికే రామానాయుడు మనవడు అయిన నాగ చైతన్య ప్రేమ వివాహం చేసుకున్న సమంత నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

Tags: miheeka bajaj rana daggubati, Rana Daggubati, rana miheeka