అక్కినేని యువ హీరో నాగ చైతన్య (Naga Chaitanya) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈమధ్యనే విక్రం కుమార్ డైరక్షన్ లో థ్యాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుక్ వచ్చిన నాగ చైతన్య ఆగష్టు 11న లాల్ సింగ్ చడ్డా సినిమాతో మరోసారి అలరించనున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ తో నాగ చైతన్య కలిసి నటించిన సినిమా లాల్ సింగ్ చడ్డా. అద్వైత్ చందన్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా హిందీతో పాటుగా తెలుగులో కూడా భారీగా రిలీజ్ అవుతుంది. తెలుగులో ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు.
లాల్ సింగ్ చడ్డా సినిమాలో నాగ చైతన్య బాలరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నటించేందుకు గాను నాగ చైతన్య (Naga Chaitanya) భారీ రెమ్యునరేషన్ తీసుకున్నాడని టాక్. మొదటి బాలీవుడ్ సినిమానే అయినా లాల్ సింగ్ చడ్డా కోసం చైతు 7 నుంచి 8 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్నాడని టాక్. తెలుగులో కూడా చైతన్య తన సినిమాకు అదే రేంజ్ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు.
లాల్ సింగ్ చడ్డా సినిమాలో కరీనా కపూర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో తెలుగులో కూడా హిట్ కొట్టాలని చూస్తున్నారు ఆమీర్ ఖాన్.