బాలకృష్ణతో నటించ‌నని మొహం మీదే చెప్పిన ర‌మ్య‌కృష్ణ‌.. షాకింగ్ రీజ‌న్‌..!

నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేని పేరు. ఆరు పదుల వయసు వచ్చినా కూడా ఇప్పటికీ కుర్ర హీరోలకు ధీటుగా సినిమాల‌లో నటిస్తూ వస్తున్నారు. అలాంటి బాలకృష్ణ సరసన హీరోయిన్‌గా ఛాన్స్ వస్తే కుర్ర హీరోయిన్లు అయినా సరే ఓకే చెబుతారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ మాత్రం బాలకృష్ణతో నటించడానికి నో చెప్పిందట. మరి దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Vamsanikokkadu (1996) - IMDb

బాల‌య్య- వినాయ‌క్ కాంబోలో వ‌చ్చిన చెన్నకేశవరెడ్డి సినిమాలో బాల‌య్య‌కు జంట‌గా ట‌బు, శ్రియా న‌టించారు. ఈ సినిమాలో బాల‌య్య ద్విపాత్రాభినయం చేశాడు. 2002లో అప్పుడు చిరంజీవి ఇంద్ర సినిమాకు పోటీగా వ‌చ్చిన ఈ సినిమా 42 కేంద్రాల్లో 100 రోజులు ఆడి సెన్షేష‌న‌ల్ విజ‌యం సాధించింది. అయితే ఈ సినిమాలో బాల‌య్య‌కు జంట‌గా ముందుగా టబు ప్లేస్ లో స్టార్‌ హీరోయిన్ రమ్యకృష్ణని అనుకున్నారట.

Watch Bangaru Bullodu | Prime Video

ఇదే విష‌య‌న్ని రమ్యకృష్ణకు చెప్ప‌డంతో ఆమె నో చెప్పిందట. దానికి ముఖ్య కారణం బాలకృష్ణ సినిమాలో ద్విపాత్రభినయం చేసినప్పుడు బాలయ్య తండ్రి పాత్రకు రమ్యకృష్ణని హీరోయిన్‌గా అనుకున్నారట. కానీ రమ్యకృష్ణ ఆ పాత్రకు నో చెప్పిందట. ఎందుకంటే ఆమె ఆ సమయానికి సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ సమయంలో రెండో బాలకృష్ణకు త‌ల్లి పాత్ర‌లో రమ్యకృష్ణ నటించాల్సి వస్తే తన సినీ కెరీర్ పై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో ఆమె ఈ సినిమాలో నటించన‌ని డైరెక్ట‌ర్ వినాయ‌క్ మొఖం మీదే చెప్పేసింద‌ట‌.

Balakrishna Horryfying Ramya Krishnan Excellent Comedy Scene | TFC Comedy - YouTube

ఆ తర్వాత ఆ పాత్రకి హీరోయిన్ టబుని తీసుకున్నారు. అలాగే కొడుకు పాత్ర పక్కన హీరోయిన్ గా శ్రియని తీసుకున్నారు. అయితే బాల‌య్య‌కు చెల్లిగా దేవ‌యాని న‌టించింది. ఈ పాత్ర కోసం ముందుగా మ‌రో హీరోయిన్ ల‌య‌ను అనుకున్నారు. ఆమె చెల్లిగా చేసేందుకు ఒప్పుకోక‌పోవ‌డంతో అప్పుడు దేవ‌యానిని తీసుకున్నారు. ఇక సినిమా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.