రెండో పెళ్లితో హాట్‌టాపిక్‌గా మారిన ఈ బుల్లితెర జంట విడిపోయారా… ఊహించ‌ని షాకింగ్ నిజం..!

కోలీవుడ్ నిర్మాత రవీందర్, బుల్లితెర నటి వీజే మహాలక్ష్మి పెళ్లి వ్యవహారం దేశవ్యాప్తంగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవ‌ల కాలంలో పెళ్లి చేసుకుని పాపులర్ అయిన జంట ఇదే. అందులోనూ వీరిది ప్రేమ వివాహం. పైగా ఇద్దరికీ ఆల్రెడీ పెళ్ళై విడాకులు తీసుకోవడం కూడా జరిగింది. ఈ జంట ఇంత పాపులర్ అవ్వడానికి ముఖ్య కారణం రవీందర్ భారీ ఖాయంతో ఉండటం…మహాలక్ష్మీ సన్నగా అమ్మాయిలా ఉండడమే.

దీంతో ఆమె రవీందర్‌ను పెళ్లి చేసుకుంది కేవలం డబ్బు కోసమే అంటూ అంతా భావించి ట్రోల్ చేశారు. ఆ ట్రోలర్స్‌ను నోరు మూయిస్తూ భర్తతో కలిసి ఉన్న ఫోటోలు తరచూ షేర్‌ చేస్తూనే ఉంటుంది మహాలక్ష్మి. రీసెంట్‌గా కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు ఏకంగా వీరు విడిపోయారంటూ ప్రచారం కూడా మొదలు పెట్టారు. ఈ క్రమంలో మ‌హ‌ల‌క్ష్మీ తాజాగా త‌న‌ భర్తతో కలిసి దిగిన ఓ ఫోటో సోష‌ల్ మీడియ‌లో షేర్ చేసింది.

ఆ పోస్టుకు మహాలక్ష్మి ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా ట్యాగ్ చేసింది..’నువ్వు నా భుజంపై చేయి వేసినప్పుడు ఈ ప్రపంచంలో నేను ఏదయినా చేయగలను అన్నంత ధైర్యం వస్తుంది. నా మనసు నిండా నువ్వే అమ్ము, ఐ లవ్యూ’ అని క్యాప్షన్ ఇచ్చింది. దీనికి రవీందర్‌ కూడా లవ్‌ యూ అంటూ రిప్లై ఇచ్చాడు.

మేము విడిపోయాన్న వార్త రాగానే భయపడిపోయాను, ఇప్పుడు సంతోషంగా ఉంది..’, ‘ఈ యూట్యూబ్‌ ఛానల్‌ వాళ్లు విడాకుల దాకా వెళ్లిపోయారు, ఇక్కడ తీరా చూస్తే వీరిద్ద‌రు ఒక‌టిగా కలిసే ఉన్నారు. అంటూ కామెంట్లు చేస్తున్నారు.