చ‌నిపోయినా కూడా ఎన్టీఆర్‌, కృష్ణ మ‌ధ్య పోటీ ఆగ‌ట్లేదుగా… !

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం రీరిలీజ్ ట్రెండ్ అగ‌ట్లేదు. స్టార్ హీరోల సినిమాల నుంచి సీనియ‌ర్ హీరోల సినిమాల వ‌ర‌కు వారి కెరీర్లో సూపర్ హిట్ అయిన సినిమాలను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అవి కూడా ఆ హీరోల అభిమానులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలోనే లెజెండ్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరు అగ్ర నటుల సినిమాలు రెండు రోజుల వ్యవధిలోని రీ రిలీజ్ తో బాక్సాఫీస్ బరిలో పోటీ పడుతున్నాయి.

Mosagallaku Mosagadu' was made at just Rs 7 lakh: Superstar Krishna -  Telugu News - IndiaGlitz.com

ఆ సినిమాలు కూడా తెలుగు చిత్ర పరిశ్రమలోనే గోల్డెన్ సినిమాలుగా మిగిలిపోయాయి. సినిమాలు మరేవో కాదు ఎన్టీఆర్‌ అడవి రాముడు- సూప‌ర్‌స్టార్ కృష్ణ మోసగాళ్లకు మోసగాళ్లు. వీరిద్ద‌రి సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఒక‌ప్పుడు బాక్సాఫీస్ హీటెక్కిపోయేది. అయితే ఇప్పుడు వారిద్ద‌రు చ‌నిపోయినా కూడా త‌మ సినిమాల‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ ప‌డ‌డం గ‌మ‌నార్హం.

ఈ రెండు సినిమాల్లో 4k వెర్షన్‌లో ప్రేక్షకులు ముందుకు రానున్నాయి. బ్లాక్ బస్టర్ అడవి రాముడు.. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఈ సినిమాను మే 28న తెలుగు రాష్ట్రాలతో ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు కూడా సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తారని తెలుస్తుంది. 1970 ద‌శ‌కంలో టాలీవుడ్‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన తెలుగు మూవీగా అడ‌విరాముడు నిలిచింది. థియేట‌ర్ల‌లో ఏడాదికిపైగా ఆడి రికార్డ్ క్రియేట్ చేసింది.

Adavi Ramudu (1977) - IMDb

ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద హీరోయిన్లుగా న‌టించారు. దాదాపు న‌ల‌భై ఆరేళ్ల త‌ర్వాత అడ‌వి రాముడు మ‌ళ్లీ థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ కానుండ‌టంతో నంద‌మూరి అభిమానుల్లో ఆనందం వ్య‌క్త‌మ‌వుతోంది. ద‌ర్శ‌కుడిగా రాఘ‌వేంద్రార‌వు కెరీర్‌లో ఇదే ఫ‌స్ట్ క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ కావ‌డం గ‌మ‌నార్హం. ఇక సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా.. మే 31న మోసగాళ్లకు మోసగాడు సినిమా రీ రిలీజ్ కానుంది. ఈ సినిమా కృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాలలో ఒకటి.