దర్శకుడు శంకర్ భారతీయుడు 2 షూటింగ్ పూర్తయ్యే వరకు రామ్ చరణ్ చిత్రాన్ని హోల్డ్‌లో ఉంచినట్లు పుకార్ల పై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. రామ్ చరణ్ సినిమా గురించి శంకర్ స్వయంగా ఓ అప్ డేట్ పోస్ట్ చేశాడు.
రెండు సినిమాలు ఒకేసారి సాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇండియన్ 2 రెగ్యులర్ షూటింగ్ బుధవారం చెన్నైలో ప్రారంభమైంది. ఆర్‌సి 15 కొత్త షెడ్యూల్ సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుందని శంకర్ తెలిపారు.శంకర్ తన సోషల్ వాల్ పై ఈ విధంగా రాసాడు,హాయ్ ఎవ్రీవన్, ఇండియన్ 2 మరియు ఆర్‌సి 15 ఒకేసారి చిత్రీకరించబడతాయని అన్నాడు. సెప్టెంబర్ మొదటి వారం నుండి హైదరాబాద్ మరియు వైజాగ్‌లలో RC15 తదుపరి షెడ్యూల్ చిత్రీకరణకు సిద్ధంగా ఉంది!
RC15లో రామ్ చరణ్, కియారా అద్వానీ నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది.భారతీయుడు 2ని నాలుగైదు నెలల్లో పూర్తి చేయాలనే ఆలోచనలో శంకర్ ఉన్నాడు.