ఎన్టీఆర్ – కొర‌టాల సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో.. సూప‌ర్ స‌స్పెన్స్ వెన‌క‌..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ తారక్ కోసం అదిరిపోయే కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్‌తో ఈ సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ ఉండనుందని అర్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

Janhvi Kapoor Joins 'NTR 30'; First Look Poster Revealed – Deadline

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు ఈ సినిమా టైటిల్‌ కూడాా రివిల్ చేశారు. ఈ సినిమాకు దేవర అనే టైటిల్ కన్ఫామ్ అయ్యింది. ఇక ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోయింది. ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ఈ సినిమాపై కొర‌టాల భారీ అంచనాలను పెంచేశాడు. ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ వైరల్ గా మారింది.

ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్‌ను ముగించుకుని మూడో షెడ్యూల్ షూటింగ్ కూడా త్వరలోనే మొదలుకానుంది. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిన్న పాత్ర ఉన్నా పేరున్న న‌టుల‌తోనే నటింపజేయాలని భావిస్తోన్నార‌ట‌. ఇందుకోసం ఇత‌ర‌ ఇండస్ట్రీలకు చెందిన ఎంతో మంది నటీనటులను తీసుకుంటున్నారు.

On Koratala Siva's birthday, a streaming guide to his movies |  Entertainment News,The Indian Express

అయితే ఈ సినిమాలో ఓ ముఖ్యమైన రోల్ కోసం ఓ టాలీవుడ్ యంగ్ హీరోను ఎంపిక చేసుకున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చేసింది. కథను మలుపు తిప్పే ఆ పాత్ర కోసం చాలా మంది హీరోల‌ని అనుకున్నా.. చివరకు తెలుగు హీరోనే సెలెక్ట్ చేశారని తెలిసింది. ఆ హీరో పాత్ర కూడా ఎంతో సస్పెన్స్గా ఉంటుందిట‌.. ఇక ఆహీరో ఎవ‌రు అనేది మ‌త్రం లీక్ కాకుండా చిత్ర యూనిట్ జాగ్రత్త పడినట్లు టాక్ వినిపిస్తోంది.