రామ్‌గోపాల్వ‌ర్మ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌..

ఎవ‌రెన్ని విమ‌ర్శ‌లు చేసినా ప‌ట్టించుకోకుడు. వివాద‌స్ప‌దాల్లో నిలుస్తుంటారు. వాస్తవిక ఘటనలను సినిమాలుగా మార్చడంలో రామ్‌గోపాల్‌ వర్మ ఎప్పుడూ ముందే ఉంటాడు. కథల కోసం పెద్దగా ఆయ‌న వెతకడు.. ఎందుకంటే వివాదాలు.. సంచ‌ల‌నం రేకెత్తించిన నేరాలే ఆయన సినిమా క‌థ‌ల‌కు ముడిస‌రుకు. దాదాపు కొన్నేళ్లుగా ఆయ‌న అదే రియ‌ల్ పంథాలో సాగుతున్నారు. అందులో భాగంగా ఫ్యాక్ష‌న్ లీడ‌ర్‌, ఎమ్మెల్యే ప‌రిటాల ర‌వి జీవిత క‌థ ఇతివృత్తాంతంతో ర‌క్త‌చ‌రిత్ర‌, 9బై11, వంగ‌వీటి, ఇటీవ‌లె ఎన్టీఆర్ జీవితంలోని చీక‌టి కోణాల్ని తెర‌పైకి చూపించే ప్ర‌య‌త్నంలో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాల‌ను తెర‌కెక్కించారు. అందులో చాలా వ‌ర‌కు సినిమాలు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం పొందాయి.

ఇదిలా ఉండ‌గా తాజాగా మ‌రో రియ‌ల్ ఇన్సిడెంట్ను ఆధారంగా చేసుకుని సినిమాను తెర‌కెక్కించేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు ఆర్జీవీ. అదీ దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపి ప‌శువైద్యురాలు దిశ అత్యాచారం ఉదంతంపై తీయ‌నున్న‌ట్లు వ‌ర్మ ప్ర‌క‌టించారు. నేరం ఇది జరిగిన విధానం.. దోషులు మరణించిన విధానం చూసిన తర్వాత కచ్చితంగా ఎవరో ఒకరు సినిమా చేస్తారనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతున్నా, చివరికి వర్మనే అది ప్ర‌క‌టించి సంచ‌ల‌నం రేపారు. మై నెక్ట్స్ సినిమా దిశ అంటూ ట్వీట్ చేయ‌డ‌మే కాదు. త‌న చిత్రంలో చాలా భయంకరమైన నిజాలు చెప్పబోతున్నానని ప్రకటించి అప్పుడే క్యూరియాసిటీని రేకేత్తించాడు వ‌ర్మ‌. రేప్ చేయాలనుకునే వాళ్లు భయంతో వణికిపోయేలా తన సినిమాలో సన్నివేశాలు ఉంటాయని.. అలాంటి వాళ్లకు ఓ గుణ‌పాఠంలా సినిమా నిలుస్తుంద‌ని వివ‌రించ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదండోయ్ న్యాయశాస్త్రాన్ని అడ్డుపెట్టుకుని నిర్భ‌య కేసులో దోషుల త‌ర‌పున వాదిస్తున్న లాయర్ ఏపీ సింగ్ లాంటి వాళ్లు ఆడుకుంటున్నార‌ని, అలాంటి వాళ్లతో ఆడుకునేలా తన సినిమా ఉంటుందని చెప్పాడు వర్మ తెల‌ప‌డం విశేషం.

దిశ ఘటన తర్వాత రేపిస్టులు ఏం నేర్చుకోలేదని.. ఇంకా అలాంటి ఘటనలు ఆగలేదని వర్మ వాపోయాడు. అలాంటి వాళ్లను ఎలా శిక్షించాలో తన సినిమాలో చూపిస్తాన‌ని వివ‌రించాడు. అసలు దిశ ఘటన ఎలా జరిగింది.. ఆ రోజు ఏం జరిగింది.. ఎందుకు వాళ్లు అలా చంపేయాల్సి వచ్చింది అనే ఘోర నిజాలు కూడా తన సినిమాలో చూపిస్తానంటున్నాడు మ‌న ఆర్జీవీ. త్వరలోనే ఈ చిత్రం మొదలుపెడతానని ట్వీట్ చేశాడు వర్మ. ఇది అప్ప‌డే సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. టాలివుడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయంశంగా మారింది.

Tags: DISHA INCIDENT, LOWER AP SINGH, RamGopal Varma