ఆనంకు ఆ వైసీపీ టాప్ లీడ‌ర్‌ను ఓడించే టాస్క్ ఇస్తోన్న చంద్ర‌బాబు…!

వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి నెల్లూరు రాజ‌కీయ ప‌రిణామాలు మారుతున్నాయ‌నే చ‌ర్చ సాగుతోంది. ప్ర‌స్తుతం వైసీపీ నాయ‌కుడు, ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి త్వ‌ర‌లోనే టీడీపీ తీర్థం పుచ్చుకుంటార‌ని తెలు స్తోంది. ఇప్ప‌టికే మంత‌నాలుకూడా పూర్త‌య్యాయ‌ని, ఆయ‌న‌చేరిక ఒక్క‌టే ఉంద‌ని అంటున్నారు. అయి తే..ఈ క్ర‌మంలో ఆనంకు టీడీపీలో నెల్లూరులోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాలు అప్ప‌గించి గెలిపించే బాధ్య‌త అప్ప‌గించాల‌నే చ‌ర్చ‌సాగుతోంది.

Irrigation Minister Anil Kumar Yadav asserts people are with YSRCP

వ‌చ్చే ఎన్నిక‌లు కీల‌కంగా మారిన త‌రుణంలో వైసీపీలోని కీల‌క నేత‌ల‌ను ఓడించాల‌నేది టీడీపీ ల‌క్ష్యం. ఇలా..జిల్లాకు ఇద్ద‌రు చొప్పున క‌నీసం ఉన్నార‌నేది తెలిసిందే. నెల్లూరు జిల్లాను చూస్తే.. రెండు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నాయ‌కుల‌ను ఓడించాల‌ని టీడీపీ ల‌క్ష్యంగా పెట్టుకుంది. కానీ, అది సాధ్యం కావ‌డం లేదు. వీటిలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్ ఒక‌రు.

ఈయ‌న‌ను ఓడించే బాధ్య‌త‌ల‌ను నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే.. ఇంకా టీడీపీ తీర్థం పుచ్చుకోని కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి తీసుకున్నారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ అనిల్ ఓట‌మిని చూస్తాన‌ని.. ఆయ‌న ప‌దే ప‌దే చెబుతున్నా రు. ఆయ‌న త‌మ్ముడు.. ఇక్క‌డ పాగా వేసే ప్ర‌య‌త్నాలు కూడా చేస్త‌న్నారు. టీడీపీ త‌ర‌పున ఆయ‌న కు టికెట్ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ఇదే జ‌రిగితే.. నెల్లూరు సిటీలో పెద్ద యుద్ధం త‌ప్ప‌దు.

Revolutionary changes visible in agri sector: Kakani Govardhan Reddy

ఇక‌, టీడీపీ టార్గెట్‌లో ఉన్న మ‌రో కీల‌క నియోజ‌క‌వ‌ర్గం స‌ర్వే ప‌ల్లి. ఇక్క‌డ వ‌రుస ఐదు ఎన్నిక‌ల్లోనూ టీడీపీ ప‌రాజ‌యం పాల‌వుతోంది. సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి.. ఇక్క‌డ ప‌ల్టీలు కొడుతున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా.. ఇక్క‌డ గెలుపు గుర్రం ఎక్కాల‌నేది.. ముఖ్యంగా మంత్రి కాకాని గోవ‌ర్ధ‌న్‌రెడ్డిని ఓడించాల‌నేది టీడీపీ టార్గెట్‌. ఈ నేప‌థ్యంలో ఈ టాస్క్‌ను ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డికి అప్ప‌గిస్తే.. బాగుంటుంద‌నే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం చేస్తారో చూడాలి.