“రామ బాణం” రివ్యూ: టైం చూసి కొట్టిన గోపీచంద్ .. “బాణం” దించేసాడుగా..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్న యాక్షన్ హీరోగా పేరు సంపాదించుకున్న గోపీచంద్ స్క్రీన్ పై కనపడబోతున్నాడు అని తెలియగానే జనాలు ఎటువంటి ఫీలింగ్ ఎంజాయ్ చేస్తారు మనందరికీ బాగా తెలిసిందే. టాలీవుడ్ మ్యాంచో హీరోగా పేరు సంపాదించుకున్న హీరో గోపీచంద్ లేటెస్ట్ గా నటించిన సినిమా “రామబాణం”. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం నాన్న తంటాలు పడుతున్న గోపీచంద్ .. ఈ సినిమా పైన హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు . ఈ సినిమా కోసం గోపీచంద్ ఎంత కష్టపడ్డాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ క్రమంలోనే భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన గోపీచంద్ రామబాణం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి టాక్ క్రియేట్ చేసుకుందో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!

Ramabanam Movie Review, USA Premiere Report

గతంలో గోపీచంద్ డైరెక్టర్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన లక్ష్యం – లౌక్యం సినిమాలు బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగ రాశాయి. ఈ క్రమంలోనే వాళ్ల నుంచి మూడో సినిమా రాబోతుంది అని తెలియడంతోనే అభిమానులు హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు . ఖచ్చితంగా ఈ సినిమా కూడా హిట్ అవుతుందని .. హ్యాట్రిక్ హిట్ కొడతారు అని ..మైండ్ లో ఫిక్స్ అయిపోయారు. కాగా గోపీచంద్ ఫైనల్లీ ఆ పేరుని నిలబెట్టుకున్నాడనే చెప్పాలి..!

భారీ ఎక్స్పెక్టేషన్స్ తో భారీ తారాగణంతో తెరకెక్కిన గోపీచంద్ రామబాణం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ కామెంట్స్ తో దూసుకుపోతుంది . మరీ ముఖ్యంగా ఇప్పటివరకు యాక్షన్ – ఫైట్స్ -మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలతో విసుగెత్తి పోయిన బాక్స్ ఆఫీస్ కి మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ అందించింది ఈ సినిమా. ఈ మధ్యకాలంలో లేడీస్ థియేటర్స్ కి రావాలంటే భయపడిపోతున్నారు ..అన్ని సినిమాలు బోల్డ్ కంటెంట్ తో ..యాక్షన్ సినిమాలతో తెరకెక్కుతున్నాయి. ఎక్కడ కామెడీ ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఉండట్లేదు. ఈ క్రమంలోని శ్రీవాస్ ఆ పాయింట్ ని క్యాష్ చేసుకొని సినిమాని ఫ్యామిలీ సెంటిమెంట్ గా తెరకెక్కించి అటువైపుగా లేడీ ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేశాడు .

Rama Banam (2023) | Rama Banam Telugu Movie | Rama Banam Cast & Crew, Story, Release Date, Review, Photos, Videos – Filmibeat

ఫ్యామిలీ సెంటిమెంట్ స్టోరీ రొటీన్ ది అయినా కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ పట్టించి అక్కడక్కడ నేటితరం యువత కోరుకునే ఎలిమెంట్స్ ను దట్టించి సినిమాకి తనదైన స్టైల్ లో డైరెక్షన్ వహించాడు. అన్నదమ్ముల సెంటిమెంట్ ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. చిన్నప్పుడుఏ బ్రదర్ తో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయి డాన్ అవుతాడు. మరి ముఖ్యంగా ఈ సినిమాకి డింపుల్ హయాతి అందాలు ప్లస్ అయ్యాయని చెప్పాలి. అఫ్కోర్స్ కధపరంగా అమ్మడికి పెద్ద వాల్యూ లేకపోయినా అందం పరంగా బానే స్క్రీన్ స్పేస్ ఇచ్చాడు అంటున్నారు జనాలు . అంతేకాదు జగపతిబాబు ఇంటర్వెల్ లో ఇచ్చే ట్విస్ట్ సినిమాకి హైలైట్ గా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు .

మొత్తంగా అభిమానులకి గోపీచంద్ ని ఎలా చూడాలి అనుకుంటున్నారో ..ఆ విధంగా చూపించి గోపీచంద్ కెరీర్ కి మరో హిట్ ఇచ్చాడు శ్రీవాస్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . కేవలం క్లాస్ ఆడియన్స్ కి కాదు మాస్ ఆడియన్స్ కి నచ్చే విధంగా డైలాగ్స్ ఉన్నాయని జనాలు చెప్పుకొస్తున్నారు . టోటల్గా యాక్షన్ – ఫ్యామిలీ – కామెడీ – రొమాంటిక్ సెంటిమెంట్ తో త్యెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ దక్కించుకుంది . మొత్తంగా రామబాణం సినిమాతో మన గోపీచంద్ హిట్ కొట్టాడని చెప్పాలి . చూడాలి మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..? గోఫీచంద్ కెరీర్ ఎలా మలుపు తిరగబోతుందో..?

Rama Banam completes censor | cinejosh.com