నీ చుట్టూనే అంటూ శ్రీలీలతో అదరగొడుతున్న రామ్.. జోడి అదిరిపోయింది బాసు..!

రామ్ పోతినేని హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకి ఇప్పటి నుంచే మంచి టాక్ వచ్చింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి స్కంద అనే పవర్ఫుల్ టైటిల్ కూడా పెట్టారు. తాజాగా ఇప్పుడు ఈ స్కంద మూవీటీమ్ కూడా ప్రేక్షకులకు చేరువయ్యేందుకు కష్టపడుతున్నారు. ఈ క్రమంలోని ఈ సినిమా నుంచి ఓ పాటను విడుదల చేయడానికి రెడీ అయ్యారు. ఇప్ప‌టికే నీ చుట్టూ చుట్టూ అంటూ సాగే పాట ప్రోమోని కూడా విడుద‌ల చేశారు.

ఇక పాటకు రామ్, శ్రీ లీల డాన్స్ ఇరగదీసినట్లు తెలుస్తుంది. మామూలుగానే రామ్ చాలా ఎనర్జిటిక్ గా డాన్స్ చేస్తాడు. అలాంటి రామ్ కి జోడిగా శ్రీ లీల కుదిరింది. ఇప్పుడున్న హీరోయిన్స్ లో డాన్స్ అదరగొట్టేవారి లో శ్రీలీల పేరు ముందుగా వినపడుతుంది. అలాంటి ఇద్దరి డాన్స్ కి మంచి పాట పడితే అదిరిపోద్ది. ఇప్పుడు ఈ నీ చుట్టూ చుట్టూ పాటలో కనిపించారు. ఈ పాట లిరికల్ వీడియోని రేపు విడుదల చేయనున్నట్టు మూవీ టీమ్ తెలిపింది. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేశారు. అందులో రామ్ చాలా స్టైల్ గా కనిపించాడు.

నిజానికి రామ్ పక్కన ఏ హీరోయిన్ అయినా డాన్స్ విషయంలో తగ్గిపోయినట్లుగా అనిపిస్తుంది. కానీ శ్రీలీల మాత్రం అదరగొట్టేస్తుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 15న విడుదల కానుంది. రామ్ బోయపాటి సినిమా మాత్రం అనుకున్న తేదీ కంటే ముందే వచ్చేందుకు సిద్ధమయ్యింది. ఇది పక్కన పెడితే రామ్ చివరగా వారియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో రామ్ ఆశలని చిత్రం మీదే ఉన్నాయి. మరి సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.