అప్ప‌ట్లో రు.10 వేల కోట్ల అధిప‌తి అయిన ఆ న‌టిని చూస్తే జాలేస్తోంది…!

1990ల కాలంలో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది టీనా అంబానీ. బాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న నటించిన ఈమె కోట్లాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. దేశి పరదేశి అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి గోల్డెన్ లెగ్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. ఈమె తమ సినిమాల్లో కనిపిస్తే చాలు సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అప్పట్లో స్టార్ హీరోస్ అంతా నమ్మేవారు. ఈమె కాల్ షీట్ల కోసం దర్శక, నిర్మాతలు ఎదురు చూస్తూ ఉండేవారు.

అలా వరుస విజయాలతో తిరుగులేని స్టార్ డమ్‌ అనుభవించింది. తర్వాత వరుస ప్లాప్స్ ఎదురుకావడంతో సినిమాల్లో అవకాశాలు తగ్గాయి. టీనా చివరిగా జిగర్వాల్ అనే సినిమాలో కనిపించింది. ఇది 1991లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీనా అప్పట్లో చాలామంది స్టార్ హీరోలతో ప్రేమాయణం నడిపిందని పుకార్లు వినిపించాయి. హీరో రిషి కపూర్ తో కూడా ఆమెకు ఎఫైర్ ఉందని వార్తలు వైరల్ అయ్యాయి. అదంతా అవాస్తవమని కపూర్ తన ఆటో బయోగ్రఫీలో వివ‌రించ‌డంతో దానికి ఫుల్ స్టాప్ పడింది.

ఇక్క‌డ మరో కామెడీ ఏంటంటే ఇది నిజం అనుకున్న సంజయ్ దత్ గొడవపడేందుకు రిషి ఇంటికి కూడా వెళ్లాడని అందులో రాసుకు వచ్చాడు. దీన్నిబట్టి అప్పట్లో ఆమె ఎంత క్రేజ్ ను సంపాదించిందో అర్థం చేసుకోవచ్చు. 1991 ఫిబ్రవరి 2న ప్రముఖ బిజినెస్ మ్యా న్ అనిల్ అంబానీని వివాహం చేసుకుంది టీనా. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన టీనా ఒకానొక దశలో పదివేల‌ కోట్లకు పైగా ఆస్తులను సంపాదించింది. తర్వాత అనేక వివాదాల్లో చిక్కుకున్న టీనా తన ఆస్తులను భర్త ఆస్తులను మెల్లమెల్లగా కోల్పోయింది. ఇలా ప్రస్తుతం ఆమె ఆస్తులు రూ.2000 కోట్లకు పడిపోయాయి. ఇలాంటి విషయాలు విన్నప్పుడు ఓడలు బళ్ళవుతాయి.. బళ్ళు ఓడలవుతాయి.. అనే నానుడి అక్షర సత్యం అనిపిస్తుంది.