అఖిల్ పుట్టక ముందు ఆడపిల్ల ప‌డుతుంద‌ని నాగార్జున – అమ‌ల చేసిన ప‌ని తెలుసా..!

అక్కినేని నాగార్జున మొదట దగ్గుపాటి లక్ష్మీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి నాగచైతన్య పుట్టాడు. ఆ తర్వాత మనస్పర్ధలు కారణంగా లక్ష్మికి విడాకులు ఇచ్చినా నాగార్జున ఆమల‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లి అక్కినేని నాగేశ్వరరావుకు ఇష్టం లేకపోయినా ఎదిరించి అమలను వివాహం చేసుకొని అక్కినేని ఇంటి కోడలుగా తీసుకువచ్చాడు నాగార్జున. వీరిద్దరూ వివాహం తర్వాత అమల సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇటీవల మళ్ళీ ఇండస్ట్రీలోకి తల్లి పాత్రలతో రీఎంట్రీ ఇచ్చింది అమల. అయితే అఖిల్ పుట్టే ముందు ఒక ఆసక్తికరమైన సంఘటన నాగార్జున- అమల జీవితం లో జరిగిందట. మరి వీరి జీవితంలో జరిగిన ఆ సంఘటన ఏంటో ఇప్పుడు చూద్దాం. అమ‌ల‌ ప్రెగ్నెంట్‌గా ఉన్న టైంలో ఓ రోజు నాగార్జున అమలకు జెండ‌ర్ టెస్ట్ చేయించడానికి అమెరికా తీసుకువెళ్లాడట. అమెరికాలో అమలకు జెండ‌ర్ టెస్ట్‌ చేసి మీకు ఆడపిల్ల పుట్టబోతుందని చెప్పారట. దాంతో అమల – నాగార్జున ఎంతగానో సంతోష పడిపోయారట.

పుట్టబోయే ఆడపిల్ల కోసం డ్రెస్సులు, అమ్మాయిలు ఆడుకునే బొమ్మలు అన్నీ కొని ఇంట్లో పెట్టుకున్నారట. తీరా నాగార్జున అమలకు షాక్ ఎదురైంది. అఖిల్ పుట్టాడు. దీంతో అమల – నాగార్జున ఆడపిల్ల పుడుతుందని మనకు వాళ్ళు అబద్ధం చెప్పారు అంటూ డాక్టర్‌ని తెగ తిట్టుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టాడు. నాగార్జున అమలకి ఆడపిల్లలు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ కొన్ని కారణాలతో అఖిల్‌ తర్వాత ఈ జంట పిల్లలను కనలేదని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.