ఆ హీరోయిన్‌ను గాఢంగా ప్రేమించి పెళ్లి వ‌ర‌కు వెళ్లిన రామ్‌…. చెడ‌గొట్టిన టాలీవుడ్ సెల‌బ్రిటీ …?

టాలీవుడ్ యంగ్ హీరో ఎనర్జిటిక్ స్టార్‌గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో రామ్ పోతినేని. దేవదాసు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ వచ్చిన ఈ చాక్లెట్ బాయ్ ఎంతోమంది అమ్మాయిలకు కలలు రాకుమారుడు. ఈ రీసెంట్ టైమ్స్‌లో టాలీవుడ్‌లో వరుసగా యంగ్ హీరోలు పెళ్లిళ్లు చేసుకోవడంతో ఈ యంగ్ హీరో కూడా పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Vunnadhi Okate Zindagi Telugu Movie Review | Ram Vunnadhi Okate Zindagi  Movie Review | VOZ Telugu Movie Review | 123telugu.com

అయితే ఆ వార్తల‌పై రామ్ బాబాయ్ స్రవంతి రవి కిషోర్ కూడా క్లారిటీ ఇచ్చారు. అలాంటి వార్తలో నిజం లేదని అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు రామ్ పెళ్లి గురించి పక్కన పెడితే… రామ్‌ సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే ఓ స్టార్ హీరోయిన్‌తో ప్రేమలో పడ్డారట. మరి ఆ హీరోయిన్‌తో రామ్‌ పెళ్లి వరకు వెళ్లకుండా కొంద‌రు అడ్డుపడ‌డంతోనే ఆ పెళ్లి ఆగిందంటారు.

Hello Guru Prema Kosame (2023) - Movie | Reviews, Cast & Release Date -  BookMyShow

రామ్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన సినిమా ఉన్నది ఒకటే జిందగీ. ఈ సినిమా తర్వాత మళ్లీ వీరు ఇద్దరూ కలిసి హలో గురు ప్రేమకోసమే సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమాల తర్వాత అనుపమ- రామ్ మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది.. అది కాస్త ప్రేమ వరకు దారితీసిందట. అదే స‌మ‌యంలో విరుద్ధరు కలిసి నటించిన రెండో సినిమా హలో గురు ప్రేమకోసమే సినిమా షూటింగ్ టైంలో వీరి మధ్య ఏదో నడుస్తుందని టాక్ గట్టిగానే వినిపించింది.

Dil Raju Biography: Age, Family, Movies, Images

ఈ విషయం తెలుసుకున్న అగ్ర నిర్మాత‌ దిల్ రాజు అనుపమకి గట్టి వార్నింగ్ ఇచ్చి ప‌డేశాడ‌ట‌. పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగడం చాలా కష్టమని చెప్పడంతో రామ్‌తో అనుపమ బ్రేకప్ చెప్పేసింద‌ని అప్ప‌ట్లో కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. అప్పటినుంచి ఇప్పటివరకు మళ్ళీ రామ్‌ అనుపమతో కలిసి ఎలాంటి సినిమా చేయలేదు.