ఎన్టీఆర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హీరోయిన్ గురించి ఈ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ తెలుసా..!

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో హీరోయిన్ గా రాణించాలి అంటే అందంతో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి. అది ఉంటేనే ఏదో ఒక టైంలో వారికి బ్రేక్ వస్తుంది.. అలా వస్తే చాలు స్టార్ హీరోయిన్ గా ఎదుగుతారు. లేదంటే కొన్ని సినిమాల తర్వాత చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి మ‌టుమాయం అవుతారు. అలాంటి హీరోయిన్ల‌లో కీర్తిచావ్లా ఒకరు. ఇండస్ట్రీకి వచ్చి రావడంతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన హీరోయిన్లు కూడా ఆ తర్వాత సినిమాల విషయంలో పప్పులో కాలు వేసి.. మంచి కథలు ఎంపిక చేసుకోకపోవడంతో క‌నుమరుగవుతుంటారు. అలాంటి హీరోయిన్లలో ఎన్టీఆర్ ఆది హీరోయిన్ కీర్తీచావ్లా కూడా ఒక‌రు.

వివి. వినాయక్ డైరెక్ట్ చేసిన ఆది సినిమాలో ఎన్టీఆర్ జోడీగా నటించి కీర్తిచావ్లా తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా అప్పట్లో ఓ సంచ‌ల‌నం. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ అంటే ఆమెకు ఎంత స్టార్ డమ్ రావాలి. కాని కీర్తీ చావ్లాకు అది ద‌క్క‌లేదు. ఆది సినిమా తర్వాత ఆమె సినిమాల విషయంలో నిర్లక్ష్యంగా ఉంద‌న్న‌ చిన్న విమర్ష ఉంది. ఎన్టీఆర్ లాంటి హీరోతో.. ఆది సినిమా తరువాత కీర్తి.. కెరీర్ పరుగులు పెడుతుంది అనుకున్నారు.

కాని ఆమె చాలా యేళ్ల పాటు ఖాళీగా ఉండి జెడి చక్రవర్తి హీరోగా వచ్చిన కాశి సినిమాలో నటించింది. ఈ సినిమా ప్లాప్‌ అవ్వడంతో.. కీర్తికి మళ్ళీ బ్రేక్ రాలేదు. ఆ తర్వాత ఓ అమ్మాయి క్రైమ్ స్టోరీ, సాధ్యంతో పాటు మరికొన్ని సినిమాల్లో నటించి… ఆ త‌ర్వాత ఇండ‌స్ట్రీ నుంచి మాయం అయ్యింది. త‌ర్వాత తన స్నేహితులతో కలిసి ఓ వ్యాపారం స్టార్ట్ చేసి బండి లాగిస్తోంది. అప్ప‌టి నుంచి కీర్తి మ‌ళ్లీ సినిమాల వైపు క‌న్నెత్తి కూడా చూడ‌లేద‌ట‌.

ప్రస్తుతం చూడ‌డానికి కీర్తీచావ్లా ఎంతో బొద్దుగా ఉంది. అయితే ఇప్పటికీ కీర్తి చావ్లా పెళ్ళి చేసుకోలేదు. ఆమె వ‌య‌స్సు 40కు ద‌గ్గ‌ర్లో ఉంటాయి. అయితే కీర్తి ఓ వ్యక్తితో ప్రేమ‌లో ఉందంటూ ప‌లు వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాకు సైతం ఎంతోదూరంగా ఉండే కీర్తిచావ్లా త‌న విష‌యాలు కూడా బ‌య‌ట‌కు లీక్ కాకుండా జాగ్ర‌త్త ప‌డుతుంది. అయితే ఆమెను ప్ర‌స్తుతం ఫొటోల్లో బాగా లావెక్కిపోయింది. ఇవి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.