రామ్‌చ‌ర‌ణ్ – శంక‌ర్ సినిమా టైటిల్ వ‌చ్చేసింది… ఊరించి పెద్ద షాకే ఇచ్చారుగా…!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత… ఇటు శంకర్ డైరెక్టర్ కావడం… పైగా పాన్ ఇండియా హిట్ తర్వాత రాంచరణ్ నటించిన సినిమా అవ్వ‌డం, బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కియారా అద్వానీ హీరోయిన్గా చేస్తుండడంతో ఈ సినిమా కోసం సౌత్ ఇండియన్ సినీ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

త్రిబుల్ ఆర్‌ సినిమా తర్వాత రామ్ చరణ్ ఆచార్య సినిమాలో నటించినా.. అందులో చరణ్ హీరో కాదు.. మెయిన్ హీరో చిరంజీవి. దీంతో త్రిబుల్ ఆర్ సినిమాతో చరణ్ తనుకు వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్‌ను ఈ సినిమాతో కంటిన్యూ చేస్తాడని మెగా అభిమానులు ఆశలతో ఉన్నారు. ఈ సినిమాకు సీఈఓ అనే టైటిల్ ఖరారు చేసినట్టు గత కొద్ది నెలలుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను చిత్ర బృందం రివీల్‌ చేసింది.

ఈ క్రేజీ ప్రాజెక్టుకు గేమ్ చేంజ‌ర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఒక వీడియో కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇక అంజలి – శ్రీకాంత్, నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక కోలీవుడ్ ద‌ర్శ‌కుడు ఎస్‌జె. సూర్య మెయిన్ విల‌న్‌గా నటిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనా సీఈవో టైటిల్‌తో ఊరిస్తూ వచ్చిన శంక‌ర్ ఇప్పుడు గేమ్ చేంజ‌ర్ టైటిల్ ఎనౌన్స్ చేసి కాస్త షాక్ ఇచ్చాడు.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, Mega Family, RamCharan, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news