చంద్ర‌బాబు + ప‌వ‌న్ క‌లిస్తే దిమ్మ‌తిరిగే రిపోర్ట్ మోడీ చేతిలో …!

ఏపీలో గత సాధారణ ఎన్నికలకు ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం వన్ సైడ్ గా వైసిపికి సపోర్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. 2014 ఎన్నికల్లో టీడిపి, బిజెపి, జనసేన కలిసి పోటీ చేశాయి. ఆ ఎన్నికలలో జనసేన పోటీ చేయకపోయినా టీడిపి, బిజెపి కూటమికి సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. మూడేళ్ల తర్వాత బిజెపితో టీడిపి తెగతెంపులు చేసుకుంది. కారణం ఏదైనా బిజెపి చంద్రబాబును బాగా టార్గెట్ చేసింది. ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది. చివరకు ఎన్నికల సమయంలో వైసిపికి బిజెపి సహకరించిన పరిస్థితి స్పష్టంగా కనిపించింది.

Narendra Modi, Chandrababu Naidu thank Pawan Kalyan! | Telugu Movie News -  Times of India

జగన్ ఏకంగా 151 ఎమ్మెల్యే సీట్లతో పాటు 22 లోక్ స‌భ సీట్లు గెలుచుకుని అప్రతిహత విజయం సాధించారు. జగన్ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు ఏపీలో సీన్ మారుతుంది. వైసిపికి, బిజెపికి మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. జగన్ ఎంత జాగ్రత్తగా ఉండాలని చూస్తున్నా బిజెపి వాళ్లు వైసిపితో ఆట అయితే మొదలుపెట్టినట్టే కనిపిస్తోంది. కావాల‌ని బీజేపీయే జ‌గ‌న్‌, వైసీపీని క‌వ్విస్తోంది.

ఇక నిన్న మొన్నటి వరకు బిజెపికి మిత్రుడుగా ఉన‌న‌ పవన్ సైతం ఇప్పుడు క్రమక్రమంగా దూరం జరుగుతున్నట్టే కనిపిస్తోంది. ఇప్పుడు పవన్ బిజెపి పేరుకు మాత్రమే మిత్రులుగా ఉన్నారు. ఎప్పుడైనా వీరి బంధం పెటాకులు అయ్యేలా కనిపిస్తోంది. ఇక పవన్ కూడా జనసేన పదో ఆవిర్భావ సభలో టీడిపితో కలిసి వెళుతున్నట్టు సంకేతాలు ఇచ్చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసిపీపై తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. పవన్, చంద్రబాబు జట్టు కడితే ఈ కూటమి ఏకంగా 150 కు పైగా సీట్లలో విజయం సాధించి అధికారంలోకి వస్తుందన్న ఇంటెలిజెన్స్ నివేదికలు ఇప్పటికే మోడీ వద్దకు చేరుకున్నట్టు తెలుస్తోంది.

Narendra Modi: Chandrababu Naidu appeals to Narendra Modi to keep Andhra  Pradesh united - The Economic Times

2014, 2019 ఎన్నికలలో భారీ మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చారు ప్రధానమంత్రి మోడీ. అయితే ఈసారి పరిస్థితులు అంత సానుకూలంగా లేవు. ఎన్డీఏ ప్రభుత్వం పై తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది.
ఈ క్రమంలోనే బలమైన ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకునే దిశగా మోడీ, అమిత్ షా ద్వయం ఆలోచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ తమకు దూరమై టీడిపితో జట్టు కడితే భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తారని నివేదికలు మోడీ చేతిలో ఉన్నాయని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో బిజెపి మళ్లీ ఈ కూటమిలో చేరేందుకు ప్రయత్నాలు చేయవచ్చని కూడా జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఏపీలో బిజెపి పై తీవ్రమైన వ్యతిరేకత నేపథ్యంలో చంద్రబాబు, పవన్ మళ్ళీ బిజెపితో దోస్తీ చేసే సాహసం చేస్తారా ? అన్నది చూడాలి.

Jana Sena-TDP alliance all but sealed as Pawan Kalyan meets Chandrababu  Naidu - The South First

Tags: AP, ap politics, intresting news, janasena party, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news