Ram Charan : చరణ్ మాట తప్పాడు.. నెటిజెన్లు ఆడుకుంటున్నారు.!

Ram Charan : మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఏంటి మాట తప్పడం ఏంటని ఆశ్చర్యపోవచ్చు. రీసెంట్ ఇంటర్వ్యూస్ లో చరణ్ సినిమాల కలక్షన్స్ గురించి పోస్టర్స్ మీద ఓ కామెంట్ చేశాడు. సినిమా కలక్షన్స్ ని పోస్టర్స్ మీద వేయడం అనేది తనకు నచ్చదని. తన సినిమాలకు ఇక మీదట అలాంటిది జరగకుండా చూసుకుంటానని.. తన సినిమాలకే కాదు కొణిదెల బ్యానర్ లో వచ్చే సినిమాలకు కూడా పోస్టర్స్ మీద కలక్షన్స్ వేయనని అన్నారు.

కట్ చేస్తే గాడ్ ఫాదర్ సినిమా వీకెండ్ పోస్టర్స్ పై 100 కోట్లు అని వేశారు. ఈ పోస్టర్స్ చూసి చరణ్ ని ఆడేసుకుంటున్నారు నెటిజెన్లు. సినిమా ఫస్ట్ డే కలక్షన్స్ 35 కోట్లు అంటూ కూడా పోస్టర్స్ వదిలారు. అంటే చరణ్ మాట తప్పాడని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా వాళ్లు తమ సినిమా ప్రమోషన్స్ కోసం ఏమైనా చెబుతారు వాటిని నమ్మాల్సిన అవసరం లేదని మరోసారి ప్రూవ్ అయ్యింది.

ఇక చరణ్ ప్రస్తుతం శంకర్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ప్రభుత్వ అధికారుల అవినీతి నేపథ్యంతో ఈ సినిమా వస్తుంది. సినిమాలో చరణ్ కూడా ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నాడు. సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాని 2023 సమ్మర్ ప్లాన్ చేస్తున్నారు.

Tags: chiranjeevi, godfather, ram charan, RC15, Shankar, Tollywood