NBK : బాలయ్య కమిట్ మెంట్ అంటే ఇది.. జస్ట్ ప్రోమో కోసం ఇంతగా..!

NBK : నందమూరి నట సింహం బాలయ్య బాబు సినిమా కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటాడని తెలిసిందే. ఈమధ్య ఆయన టాక్ షో హోస్ట్ గా కూడా చేస్తూ అలరిస్తున్నారు. ఆహా అన్ స్టాపబుల్ షో కోసం బాలకృష్ణ ఓ రేంజ్ లో కష్టపడ్డారు. అందుకే అన్ స్టాపబుల్ సీజన్ 1 సూపర్ సెన్సేషన్స్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు అన్ స్టాపబుల్ సీజన్ 2 కి రంగం సిద్ధమైంది. లేటెస్ట్ గా అన్ స్టాపబుల్ సీజన్ 2 కి సంబందించిన ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు. బాలయ్య డిఫరెంట్ వేషదారణతో స్టైలిష్ లుక్ తో ఈ ప్రోమో ఉంది.

ముఖ్యంగా జస్ట్ ప్రోమో కోసమే బాలకృష్ణ చాలా కష్టపడ్డారని తెలుస్తుంది. ఇష్టమైన పనిని ఎంత కష్టమైనా సరే చేయాల్సిందే. ఈ క్రమంలో బాలయ్యని మించిన వారే లేరని చెప్పొచ్చు. బాలయ్య కమిట్ మెంట్ కి ఇదొక నిదర్శనమని చెప్పొచ్చు. ఆహా అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రోమో అదిరిపోయింది. ఈ ప్రోమోని యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశారు. అ!, కల్కి, జాంబి రెడ్డి సినిమాలతో మెప్పించిన ఈ డైరక్టర్ ప్రస్తుతం హనుమాన్ సినిమా తీస్తున్నాడు.

బాలయ్య అన్ స్టాపబుల్ మొదటి ఎపిసోడ్ గా టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు గెస్ట్ గా వస్తున్నారని తెలుస్తుంది. ఈసారి సీజన్ 2 అంతకుమించి అనిపించేలా ఉండబోతుందని తెలుస్తుంది. బాలయ్య ఈ సీజన్ 2 కోసం మరింత ఎనర్జీతో పనిచేస్తున్నారట.

Tags: aha, Aha Video, balakrishna, balayya, NBK, Unstoppable 2, Unstoppable Season 2