యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR ) ఆర్.ఆర్.ఆర్ తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో భారీ మూవీ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేఏస్తున్నారు. కొరటాల శివతో ఆల్రెడీ జనతా గ్యారేజ్ సినిమా చేసిన ఎన్టీఆర్ మరోసారి ఆ సూపర్ హిట్ కాంబో రిపీట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాని తెలుగు, తమిళం, మళయాళ, కన్నడ భాషలతో పాటుగా హిందీ భాషలో కూడా రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే కేవలం ఈ ఐదు భాషల్లోనే కాదు మరో నాలుగు భాషల్లో కూడా ఎన్టీఆర్ 30వ సినిమా రిలీజ్ ఉంటుందని టాక్.
ఎన్టీఆర్ 30వ సినిమా దాదాపు 9 భాషల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. యువసుధ ఆర్ట్స్ లో మిక్కిలినేని సుధాకర్ ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ తో హిందీలో NTR పేరు మారుమ్రోగుతుంది. ఇక ఎన్టీఆర్ 30వ సినిమాతో సోలోగా సత్తా చాటాలని చూస్తున్నాడు. హిందీ బాక్సాఫీస్ పై తెలుగు సినిమాల సునామి తగ్గట్లేదు. వరుస సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్నాయి.
ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలంతా కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ సంద్డి చేస్తున్నారు. మరి ఈ సినిమాలు ఏమేరకు ప్రేక్షకులను మెప్పిస్తాయో చూడాలి. ఈ సినిమా తర్వాత తారక్ కె.జి.ఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే.