ర‌ఫ్ఫాడించిన రామ్ – బోయ‌పాటి ర్యాపో… అరాచ‌కం మించి (వీడియో)

టాలీవుడ్ యంగ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని – మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మొదటిసారిగా క‌లిసి చేస్తోన్న యాక్షన్ డ్రామా షూటింగ్ శర‌వేగంగా జ‌రుగుతోంది. తాజాగా రామ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఫస్ట్ థండర్ పేరిట ఓ వీడియో రిలీజ్‌ చేశారు. రామ్ చెప్పిన మాస్ డైలాగ్‌తో ఫస్ట్ థండర్ పవర్ ఫుల్ రేంజ్‌లో ఉంది.

నీ స్టేట్ దాటలేన‌న్నావ్‌… దాటా.. నీ గేట్ దాట‌లేన‌న్నావ్‌.. దాటా… నీ ప‌వ‌ర్ దాట‌లేన‌న్నావ్‌… దాటా ఇంకేంటి దాటేది బొంగులో లిమిట్సూ అంటూ రామ్ చెప్పిన డైలాగ్ చూస్తే సినిమా ఎంత ప‌వ‌ర్ ఫుల్‌గా ఉండ‌బోతోందో క్లారిటీ అయితే వ‌చ్చేసింది. ఇక థ‌మ‌న్ మ్యూజిక్ కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంది. థ‌మ‌న్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్ ను వేరే లెవెల్ కి తీసుకు వెళ్ళింది.రామ్ రగ్డ్ లుక్ చాలా బాగుంది.

రామ్ ఫ్యాన్స్‌కు, బోయ‌పాటి ఫ్యాన్స్‌కే కాకుండా టాలీవుడ్ ఊర‌మాస్ అభిమానుల‌కు ఈ ర్యాపో వీడియో అయితే పండ‌గే. ఇక శ్రీలీల, సాయి మంజ్రేకర్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. అక్టోబర్ 20, 2023న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.