కెరటం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ (Rakul ) ముందు చిన్న సినిమాల్లో చేస్తూ స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. దాదాపు తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరితో నటించిన ఈ అమ్మడు ఈమధ్య ఇక్కడ ఫాం కోల్పోయిందని చెప్పొచ్చు. అయితే టాలీవుడ్ లో వచ్చిన అర కొర అవకాశాలు చేస్తూనే బాలీవుడ్ మీద దృష్టి పెట్టింది రకుల్. ఆల్రెడీ అక్కడ రెండు మూడు ప్రాజెక్ట్ లు చేస్తున్న రకుల్ మరోపక్క తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కోసం సోషల్ మీడియాలో టచ్ లో ఉంటుంది.
తన హాట్ ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ ని అలరించే రకుల్ లేటెస్ట్ గా పింక్ డ్రెస్ తో సర్ ప్రైజ్ చేసింది. పింక్ సూట్ లో అమ్మడి గ్లామర్ షో అదిరిపోయిందని చెప్పొచ్చు. సినిమాల ఛాన్సులు ఎలా ఉన్నా రకుల్ (Rakul )కి సోషల్ మీడియా ఫాలోయింగ్ మాత్రం బాగా ఉందని చెప్పొచ్చు. పింక్ డ్రెస్ లో రకుల్ అందాల జోరు అదిరిపోయింద్దని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే ఇండియన్ 2 లో నటిస్తున్న రకుల్ ఆ సినిమాతో పాటుగా 31 అక్టోబర్ లేడీస్ నైట్| అనే తెలుగు, తమిళ బైలింగ్వల్ మూవీలో కూడా నటిస్తుంది.