Kanishka Sony : మగాడు అవసరం లేదు.. తనని తానే పెళ్లి చేసుకున్న నటి.. శృంగారం ఎలా అంటూ కామెంట్స్..!

ప్రస్తుతం ఈ ప్రపంచంలో చాలా వింతలు జరుగుతున్నాయి. కొందరు తమకు ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఇండియన్ కల్చర్ లో పెళ్లి అనేదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక వయసు వచ్చాక అబ్బాయి అమ్మాయికి కలిపి పెళ్లి చేయడం అన్నది జరుగుతుంది. కాని ఈ కాలపు వింతపోకడల వల్ల ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నారు.

ఇక లేటెస్ట్ గా ఓ సీరియల్ నటి అటు మగాడు.. ఇటు మరో అమ్మాయి కాకుండా తనని తానే పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది. సీరియల్ నటి కనిష్క సోని (Kanishka Sony). తనని తానే పెళ్లి చేసుకుంది ఈ సీరియల్ నటి. తనకి తోడు తానే అని.. ఈ ప్రపంచంలో తనకు ఇష్టమైందని తానే అని చెప్పింది. మగాడు అవసరం లేకుండా ఆమె తనని తానే పెళ్లి చేసుకుంది. తన కలలన్నిటిని తనకు తానుగా సొంతంగా సాధించుకుంటానని.. తాను ప్రేమిస్తున్న ఏకైక వ్యక్తి తానే అందుకే తనకు తానే పెళ్లి చేసుకున్నానని అన్నది కనిష్క సోని.

ఇంత అందమైన నటి Kanishka Sony తనని తానే పెళ్లి చేసుకోవడం పట్ల ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ శృంగారం ఎలా అని కామెంట్స్ చేస్తున్నారు.

Tags: Bollywood, Kanishka, Kanishka Sony, Marriage