” రాఖీ పండగ ” ఎప్పుడు.. ఆగస్టు 30 నా..? లేక 31వ తారీఖునా..? అసలు ఏ తేదీలో జరుపుకోవాలంటే..!

రాఖీ పండగ ప్రతి శ్రావణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది పౌర్ణమి 30న,31న అనే సందేహం ఉంది. ఈ ఏడాది పౌర్ణమి రెండు రోజుల్లో వచ్చింది. అయితే 30వ‌ తేదీన‌ భద్రకాలం ఉంది. దీని గురించి తెలుసుకోకుండా రాఖీ కట్టే పొరపాటు ఎవరూ చేయొద్దు. ప్రపంచంలో ఎన్నో పండగలు ఉన్నా సరే ఒక రాఖీ పండక్కి మాత్రం ఎటువంటి కులబేధనా ఉండదు. సోదరి సోదరీమణులు ప్రేమతో కట్టే రాఖీ పండగని చాలా అపురూపంగా జ‌రుపుకుంటు ఉంటారు.

భద్రకాలం గురించి తెలియాలంటే పురాణాల్లోకి వెళ్లాలి. లంకాధిపతి రావణాసురుడు గురించి అందరికీ తెలిసిందే. ఈయన సోదరి భద్ర తన అన్నగారైన రావణాసుడికి పౌర్ణమి అనుకుని రక్షాబంధనాన్ని తప్పు సమయంలో కట్టింది. అలా చేయడం వల్లే రావణాసుడికి రాముడు చేతిలో చావు వచ్చిందని చాలామంది చెబుతూ ఉంటారు. మొత్తానికి పూర్ణానికి ముందు ఉండే కాలం భద్రకాలం అని అందరూ నమ్ముతున్నారు.

కాబట్టి మీ అన్నదమ్ములకి భద్రకాలంలో రాఖి కట్టకండి. పౌర్ణమి ప్రకారం రాఖీ పండగ 30, 31న‌ రెండు తేదీల్లో వచ్చింది. అయితే పౌర్ణమి 30వ తేదీ రాత్రి 9.01 గంటలకు ప్రారంభమై 31 వ తేదీ ఉదయం 07.05 నిమిషాల వరకు ఉంటుంది. సోదరీమణులు ఈ సమయంలో ఎప్పుడైనా తమ అన్నదమ్ములకు రాఖీ కట్టుకోవచ్చు. ఈ సమయంలో రాఖీ కడితేనే మేలు జరుగుతుంది. పొరపాటున భద్ర కాలంలో రాఖీ కడితే సోదరులకు కష్టాలు, సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు.