ఎటికెలకు చివరికి వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లను ప్రత్యక్షంగా చూడాలనుకునే క్రికెట్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ వినిపిస్తోంది. టోర్నీ ఫస్ట్ మ్యాచ్ కేవలం 41 రోజులు ముందు నుంచి మాత్రమే ఐసీసీ టికెట్లను అమ్మడానికి ఫిక్సయింది. మ్యాచ్ తేదీలను బాగా ఆలస్యంగా ప్రకటించిన ఐసిసి ఇప్పుడు డిఫరెంట్ రీజన్స్ తో వాటిని ఇంప్లిమెంట్ చేసింది. బుధవారం చివరి షెడ్యూల్ విడుదల చేసింది. దీనితో పాటు ఫ్యాన్స్ తమ ప్లాన్స్ చేసుకునేందుకు వీలుగా టికెట్లు అమ్మకాల వివరాలను కూడా వెల్లడించింది.
భారత్ ఆడే వామప్ ప్రధాన మ్యాచ్‌లు, భారత్ ఆడని ఇతర మ్యాచ్‌లు అంటూ రెండు రకాలుగా టికెట్లు అమ్మకాలని ఐసిసి డివైడ్ చేసింది. భారత్ ఆడే 9 లీగ్ మ్యాచ్‌లలో టికెట్లను 6 డిఫరెంట్ స్టేజ్ ల పైన అమ్మకానికి ఉంచుతుంది. మిగతా సిరీస్ మ్యాచ్‌లలాగా నేరుగాటికెట్లనుకునేందుకు వీలు ఉండదు. వరల్డ్ కప్ టికెట్ల కోసం అభిమానులు ఆన్లైన్లో ముందుగానే వివరాలను రిజిస్టర్ చేసుకోవాలి. దాని ప్రకారమే ఆ తర్వాత కేటాయింపులు జరుగుతాయని ఐసిసి పేర్కొంది. ఆగస్టు 15 నుంచి అభిమానులు http://www.cricketworldcup.com/register ఈ వెబ్సైట్లో తమ వివరాలను ఫిల్ చేయాల్సి ఉంటుంది.
టికెట్ల అమ్మకాలు తేదీ
25 ఆగస్టు నుంచి: భారత్‌తో కలిపి ఇతర జట్ల వామప్ మ్యాచ్‌లు లేదా ప్రధాన మ్యాచులు.
30 ఆగస్టు నుంచి : కేవలం భారత్ ఆడే రెండు మ్యాచ్లు ఒకటి గువాహటీ, రెండవది తిరువనంతపురం.
31 ఆగస్టు నుంచి: చెన్నై, ఢిల్లీ, పూనే లో భారత్ ఆడే మ్యాచ్‌లు.
సెప్టెంబర్ 1 నుంచి: ధర్మశాల, లక్నో , ముంబై లలో భారత్ ఆడే మ్యాచ్‌లు.
సెప్టెంబర్ 2 నుంచి : బెంగళూర్, కోల్కత్తలో భారత్ మ్యాచ్‌లు.
సెప్టెంబర్ 3 నుంచి: అహ్మదాబాద్ లో దాయాదులతో భారత్ ఆడే మ్యాచ్.
15 సెప్టెంబర్ నుంచి: సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ టికెట్లు అమ్మకాలు జరుగుతాయి.