యూఎస్ లో ” జైలర్ ” సెన్సేషన్ రికార్డ్‌… అప్పుడే ర‌జ‌నీ ఆ టార్గెట్ రీచ్‌..!

టాలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ హీరోగా తమన్నా హీరోయిన్గా నటించిన మూవీ” జైలర్ “. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో అనిరుధ్‌ మ్యూజిక్‌తో సన్‌ పిక్చర్స్ బ్యానర్ పై భారీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు చాలామంది స్టార్ యాక్టర్లు కీ రోల్స్‌లో నటించారు.

ఇటీవల యూఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయో లేదో ఈ సినిమా మాస్ ర్యాంపేజ్‌తో భారీ కలెక్షన్ల‌తో అదరగొడుతుందట. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ మూవీ లేటెస్ట్‌గా జస్ట్ ప్రీమియర్స్ తోనే ఆఫ్ మిలియన్ డాలర్స్ కలెక్షన్ ను కొల్లగొట్టినట్లు యూఎస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలిపింది. ఇంకా సినిమా రిలీజ్‌కు మ‌రో మూడు రోజుల టైం కూడా ఉంది.

దీంతో ‘ జైలర్ ‘ రికార్డులు ప్రీమియర్ల నుంచే స్టార్ట్ అవ్వ‌డం ఖాయం అయిపోయినట్లే. ఇక ఈ సినిమా ఆగస్టు 10న‌ రిలీజ్ కానుంది. ఆగస్టు 11న చిరంజీవి బోళా శంకర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరంజీవి – రజనీకాంత్ సినిమాల మధ్యన జరగబోయే ఈ పోటీలో జైలర్ ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో చూడాలి.