పెళ్లి పేరుతో నటిపై పలుసార్లు అత్యాచారం చేసిన టాప్ బిజినెస్‌మ్యాన్‌..!

ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబైలో ఇటీవల దారుణం చోటు చేసుకుంది. పెళ్లి పేరుతో ఓ ప్ర‌ముఖ‌ బిజినెస్ మ్యాన్ నటిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆ యాక్టర్ కంప్లైంట్ తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ సంఘటనపై దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ విషయాన్ని ప్రముఖ మీడియా ఏఎన్ఐ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై చాలాసార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆ నటి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్న పోలీసులు దర్యాప్తు మరింత వేగవంతం చేశారు. ఆరోపణలు ఫేస్ చేస్తున్న టాన్‌జాన్‌కి చెందిన ఆ బిజినెస్ మ్యాన్ వీర‌న్‌ పటేల్ పై ఎన్ ఎమ్ జోషి మార్గ్‌ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు.