పవిత్ర లోకేష్ గతంలో ఈ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సీనియర్ నటుడు నరేష్ జీవితంలోకి ఈమె వచ్చాక వీరిద్దరు ఎంతలా పాపులర్ అయ్యారో తెలిసిందే. పవిత్ర గతంలో హంపి కన్నడ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ అభ్యసించేందుకు ఎంట్రన్స్ టెస్ట్ లో పాల్గొంది. అప్పట్లో ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇటీవల జరిగిన సిఈటి పరీక్షల్లో ఆమె పాసైన సీనియారిటీ ఫైనల్ లిస్టులో ఆమె పేరు రాలేదు.
దీంతో ఆమెకు బిగ్ షాక్ ఎదురైనట్లుంది. పీహెచ్‌డీ చేయాలన్న ఆమె ఆశ ఇప్పట్లో నెరవేరే అవకాశం లేదు. అయితే ఈ విషయంపై యూనివర్సిటీ రిజిస్టర్ సుబ్బన్నరై మాట్లాడుతూ యాక్టర్ పవిత్ర కన్నడ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేసేందుకు ప్రయత్నించి సిఈటిలో పాస్ అయ్యారు.. కానీ మంచి ర్యాంక్‌ని సాధించలేక పోయారు. ఈ కారణంగా ఆమెకు సీట్లు లభించలేదు అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.